సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల అంశం వివాదాస్పదం అవుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. సచివాలయంలో తొలిసారి ఈ విషయమై అర్థికశాఖ ఉన్నతాధికారి ఛాంబర్ వద్ద నిరసన తెలిపిన ఉద్యోగులు.. ఆ శాఖలోని తమ సీట్లలో కూర్చుని ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో సాధారణ పరిపాలన శాఖ ద్వారా స్వయంగా ముఖ్యమంత్రికే ఇ-ఫైల్ పంపామని.. నిర్ణయం రావటంలో తీవ్ర జాప్యం ఉందని ఉద్యోగులు అందోళన చేస్తున్నారు.
సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతులు ఎప్పుడో..? - ap secretariat employees protest news
సచివాలయం ఉద్యోగుల పదోన్నతుల అంశం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. తమ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. తమ సీట్లలో కూర్చొనే ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పదోన్నతులు, రోస్టర్ పాయింట్లపై ప్రభుత్వ నిర్ణయం జాప్యమైన కారణంగా అన్యాయం జరుగుతోందంటూ ఉద్యోగులు ప్లకార్డులతో తమ సీట్లలోనే కూర్చుని వరుసగా రెండో రోజూ ఆందోళనకు దిగారు. ఆర్థికశాఖలో 3 ఉపకార్యదర్శులు, ఇద్దరు అదనపు కార్యదర్శుల పోస్టులను కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు చేస్తున్నప్పటికీ.. సచివాలయంలో పదోన్నతులు మాత్రం ఆలస్యం అవుతుండటంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ... మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు