రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది. వర్షంతో పాటు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులూ వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
RAINS IN AP: రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావారణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు వర్షాలు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమ జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా వాతావరణ సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి:Live Updates: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరద గుప్పిట్లో ఆ జిల్లాలు..