రాష్ట్రంలో ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ తుపాను.. సోమవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది దక్షిణి ఒడిశా, ఉత్తర ఏపీ నుంచి పశ్చిమ దిశగా గంటకు 8 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ ఒడిశా , దక్షిణ ఛత్తీస్‌గఢ్, విశాఖ పట్నం మీదుగా ఉన్న రుతుపవన ద్రోణి ప్రభావంతో.. మంగళ, బుధ వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
WEATHER UPDATE: రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నేడు రేపు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చిని తెలిపింది.
WEATHER UPDATE
Last Updated : Sep 28, 2021, 6:20 AM IST