భారీ వర్షాలు పడబోతున్నాయ్.. జాగ్రత్త - పశ్చిమ గోదావరి జిల్లా
వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
rtgs
రాష్ట్రానికి ఆర్టీజీఎస్ భారీ వర్షాల హెచ్చరిక చేసింది. వచ్చే 3 రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా.. వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ప్రధానంగా.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిలాలకు మంగళవారం భారీ వర్ష సూచన చేసింది.