రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని సూచించారు. అలాగే రేపు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు!
రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
రాష్ట్రంలో వర్షాభావ సూచనలు