Viral video: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే చోరీ చేశారు ఇద్దరు దొంగలు. బ్యాంకులో నగదును తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తిని అనుసరించిన ఆ దొంగలు 3లక్షల రూపాయలు అపహరించారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులకి వచ్చింది. నగరానికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్ రోడ్డులోని ప్రైవేటు బ్యాంకు నుంచి 3 లక్షల రూపాయలు విత్ డ్రా చేసి.. నగదును తన స్కూటీ డిక్కీలో పెట్టి, వెళ్తున్నాడు.
కన్నేశారు.. దోచేశారు.. పట్టపగలే చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ - స్కూటీ డిక్కీలో 3లక్షల రూపాయాలు తీసేసిన దొంగలు
Viral video: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి 3 లక్షల రూపాయలు విత్ డ్రా చేసిన వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంబడించారు. సరైన సమయం చూసి ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంలో ఉన్న ఆ డబ్బును కొట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటన దృశ్యాలు.. సీసీ కెమెరాలో నమోదు కావడంతో ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రైవేటు కార్యాలయం వద్ద వాహనం నిలిపి కార్యాలయంలోకి వెళ్లాడు. అప్పటికే ప్రవీణ్‌ను వెంబడిస్తున్న ఇద్దరు దొంగలు ఇదే అదునుగా భావించారు. రోడ్డుపక్కన నిలిపి ఉన్న స్కూటీ డిక్కీని తెరిచి అందులో నుంచి నగదును ఎత్తుకెళ్లారు. కాసేపటికి బయటికి వచ్చిన ప్రవీణ్.. డబ్బు చోరీకి గురైనట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో భాగంగా అక్కడి సీసీకెమెరాలను పరిశీలించారు. స్కూటీలో నుంచి డబ్బు దొంగిలిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి..
ఇవీ చదవండి: