నకిలీ ఎఫ్‌డీల కేసులో కొత్త వ్యక్తులు చాలా మంది బయటపడ్డారని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు(Vijayawada CP on FD fraud case) తెలిపారు. ఎఫ్‌డీల కేసు హైదరాబాద్(Telugu Akademi FDR fraud case)లో ప్రారంభమై విజయవాడకు చేరిందని.. ఆత్కూరు, భవానీపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. హైదరాబాద్ నుంచి 8 మందిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చామని వివరించారు. దాదాపు రూ.2 కోట్ల సొమ్ము రికవరీ చేశామన్న ఆయన.. రూ.2.57 కోట్ల ఆస్తులను సీజ్ చేసి కోర్టుకు అందజేశామని పేర్కొన్నారు.