దేశ రాజధాని ప్రాంతం- దిల్లీ ప్రభుత్వం (సవరణ) బిల్లు-2021పై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థపైనే ఈ బిల్లు అనేక సందేహాలు లేవనెత్తింది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి తప్ప.. కేంద్రం నియమించిన వ్యక్తికి కాదన్నది మా పార్టీ, మా ముఖ్యమంత్రి ఉద్దేశం. లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఇవ్వకూడదు. అది రాజ్యాంగవిరుద్ధం. లండన్, టోక్యో, వాషింగ్టన్‌లలో అధికారాలను ఉదహరిస్తున్నారు.
ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరా!
ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు.. రేపు లెఫ్టినెంట్ అనే పదం తీసేసి గవర్నర్‌కూ అదే అమలుచేస్తారా’ అంటూ వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వంతో ఏకభవీంచను అని ఆయన రాజ్యసభనుంచి వాకౌట్ చేశారు.
ఆ నగరాలపై లోతైన అధ్యయనం చేసే ఈ బిల్లు పెట్టారా అని నేను మంత్రిని అడుగుతున్నా. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బిల్లును పార్లమెంటరీ స్థాయీసంఘానికి పంపండి. మీ సంఖ్యాబలంతో దాన్ని ఆమోదించుకున్నా సుప్రీంకోర్టు నిలిపివేస్తుంది. వాజపేయీ ఒక్క ఓటుతో ఓడిపోయే సమయంలో కొందరు ఎంపీలు ఆయనను కలిసి నలుగురు గైర్హాజరయ్యేలా చూస్తామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ఓడిపోవడానికి బదులు తాను ఓడిపోవడానికి సిద్ధమని ఆయన చెప్పారు. భాజపా తమ నాయకుడి నుంచి ఈ విషయం నేర్చుకోవాలి. ఈ బిల్లు విషయంలో నేను భాజపా ప్రభుత్వంతో ఏకీభవించను’ అని వ్యాఖ్యానించి సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇదీ చూడండి.సీఎం జగన్ ఫిర్యాదును డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు