నేరస్థులను గుర్తించడంలో సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీని సందర్శించిన ఆయన.. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీని ప్రారంభించారు. సీడీఎఫ్‌డీలో పలు విభాగాలను పరిశీలించారు.
జన్యు రుగ్మతలపై పరిశోధనలతో పాటు నాణ్యమైన సేవలు అందించటం డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, పరిశోధన కేంద్రం ప్రత్యేకత అని వెంకయ్య అన్నారు ఆధునిక కాలంలో నేరాలు సైతం అనేక రకాలుగా జరుగుతున్నాయన్న ఆయన.. న్యాయవ్యవస్థ, పరిశోధన సంస్థలు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీడీఎఫ్‌డీ చేస్తున్న కృషి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వెల్లడించారు.