Vice President Venkaiah naidu : ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ అనేది వసంత ఋతువు ఆగమనానికి నిదర్శమని.. సమానత్వానికి సంకేతమన్నారు.
Ugadi at Swarna Bharat Trust : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్టులో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కామినేని శ్రీనివాస్, చిగురుపాటి ఉమాదేవి హాజరయ్యారు. ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఉగాదిలో ప్రాచీనమైన సాంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. ఉగాది రోజున చేసుకునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలకు ప్రతీక అని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలని ఇది సూచిస్తుందని చెప్పారు.