ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో నేటి నుంచి ఈ పాస్​ విధానం అమలు: డీజీపీ - AP Latest News

కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై డయల్‌ 100, 112కు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర ప్రయాణికుల కోసం నేటి నుంచి ఇ-పాస్ విధానం అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

By

Published : May 9, 2021, 2:06 PM IST

Updated : May 10, 2021, 8:21 AM IST

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు షరతులు కొనసాగుతాయని వివరించారు. అత్యవసర ప్రయాణికుల కోసం నేటి నుంచి ఇ-పాస్ విధానం అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు. ఇ- పాస్‌ కోసం పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని.. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్న డీజీపీ.. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కరోనా లక్షణాలు ఉన్న 104, 108 సేవలు వినియోగించుకోవాలని.. ఉల్లంఘనలపై డయల్‌ 100, 112కు సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చదవండీ... మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ: మంత్రి పెద్దిరెడ్డి

Last Updated : May 10, 2021, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details