ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్... మంత్రులను అభినందించడం శోచనీయం' - Varla Ramaiah Latest news

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం జగన్... మంత్రులను అభినందించడం శోచనీయమని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. సీఎం మంత్రుల్ని అభినందించడం చూసి పొరుగు రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

Varla Ramaiah fires on Jagan Over Ministers Appreciation
Varla Ramaiah fires on Jagan Over Ministers Appreciation

By

Published : Feb 24, 2021, 5:57 PM IST

పంచాయతీ ఎన్నికలు బాగా నిర్వహించారని ముఖ్యమంత్రి జగన్... మంత్రులను అభినందించటం శోచనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ధర్మాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే అధర్మాన్ని అభినందించారని ధ్వజమెత్తారు. మంత్రులు చేసిన అరాచకాలు చూసి న్యాయస్థానాలు కూడా అసహనం వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. సీఎం మంత్రుల్ని అభినందించడం చూసి పొరుగు రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. చేసిన అరాచకాలకు మందలించకుండా మున్సిపల్ ఎన్నికల్లోనూ నూరు శాతం గెలవాలని సీఎం అమాత్యులకు చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమని వర్ల రామయ్య మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details