వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం అధికార నివాసం బినామీల పేరుతో నిర్మించారని ఆరోపించారు. జగన్ కష్టార్జితంతో ఆ ఇల్లు కట్టారని వైకాపా నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇంటి మరమ్మతులకు రూ. 42 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే న్యాయస్థానాల్లో నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. మైనింగ్ శాఖలో సీఎం, ఆయన బంధువుల దస్త్రాలకే అనుమతులు వస్తున్నాయని వర్ల ఆరోపించారు.
'సీఎం నివాసం మరమ్మతుల కోసం రూ.42కోట్లు దుర్వినియోగం' - varla ramaiah comments on CM jagan house news
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికార నివాసం... బినామీల పేరుతో నిర్మించారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు.
varla ramaiah comments on CM jagan house
ఇదీ చదవండి : రేపు రాజధాని బంద్... ఎందుకంటే...