శుక్రవారం జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెదేపా అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ సమాయత్తం అయ్యింది. బలం లేకపోయినా పోటీలో నిలబడిన తెలుగుదేశం... 23 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరిలకు విప్ జారీ చేసినట్లు వెల్లడించింది.
రాజ్యసభ ఎన్నికలకు తెదేపా సమాయత్తం
శుక్రవారం జరిగే రాజ్యసభ ఎన్నికలకు తెదేపా సిద్ధమవుతోంది. సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలు సహా సభ్యులందరికీ తెదేపా విప్ జారీ చేసింది.
రాజ్యసభ ఎన్నికలు తెదేపా అభ్యర్థిగా వర్ల రామయ్య
అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యవహరించనుండగా... పార్టీ తరుపున ఏజెంట్‌గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను నియమించింది. సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొనాలని చంద్రబాబ ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఏజెంట్‌కి ఓటు చూపించి వేయాలని నిబంధన ఉండటంతో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి:దాడి చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే: మంత్రి అనిల్