పోలీసుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులు తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజధాని రైతులు ఆరోపించారు. పోలీసులు, మీడియా ప్రతినిధులు అని చెప్పుకుంటూ తమలో చేరి హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా పోలీసు యూనిఫాంలో కొందరు తిరుగుతున్నారన్నారు. నిన్న మందడంలో జరిగిన ర్యాలీలో ఓ మహిళ చేయి విరగ్గొట్టిన వ్యక్తిని పట్టుకుని నిలదీయగా.. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని తెలిపారు. అతన్ని ప్రశ్నించగా.. ముందు తను యూట్యూబ్ ఛానల్ ప్రతినిధినని.. తర్వాత పోలీస్నంటూ పొంతనలేని సమాధానాలు చెప్పాడని రైతులు తెలిపారు. అయితే పోలీసులు ఆ వ్యక్తిని గౌరవంగా పక్కకు తీసుకెళ్లి.. తమను ఇష్టానుసారం కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి ఉద్యమంలో అపరిచితుడు..! - అమరావతి రైతుల నిరసన
పోలీసుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులు తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజధాని రైతులు ఆరోపించారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా పోలీసు యూనిఫాంలో కొందరు తిరుగుతున్నారన్నారు.
అమరావతి ఆందోళనలో అపరిచితుడు