ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తదుపరి సీఎం ఎవరని... వైకాపా ఎమ్మెల్యేల చర్చ' - devineni uma comments on YCP governament

దిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు పక్క చూపులు చూస్తుంటే... రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తదుపరి సీఎం ఎవరనే చర్చల్లో ఉన్నారని... మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. వైకాపా పరిస్థితి మునిగిపోయే నావలా ఉందని విమర్శించారు.

uma-comments-on-ycp-mp-mlas

By

Published : Nov 19, 2019, 11:32 PM IST

మాజీమంత్రి దేవినేని ఉమా

రాష్ట్రంలో వైకాపా పరిస్థితి మునిగిపోయే నావలా ఉందని... మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. దిల్లీలో వైకాపా ఎంపీలు పక్క చూపులు చూస్తుంటే... రాష్ట్రంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చల్లో ఉన్నారని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వాన్ని కాపాడటానికి దేశంలో ఎక్కడికి వెళ్లినా ధర్మాడి సత్యంలు దొరకరని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సొంత పత్రికలో... జీతాలు చెల్లించటానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వాడుతున్నారని ఉమా ఆరోపించారు.

ఇదీ చదవండి : క్షిపణి పరీక్షా కేంద్రానికి లైన్​ క్లియర్... కానీ షరతులు వర్తిస్తాయి

ABOUT THE AUTHOR

...view details