ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గూఢచారులు గుట్టుగా ఓటేయొచ్చు.. తెలుసా..?

ఓట్ల పండుగ వచ్చినప్పుడు.. వరుసలో నిలబడి ఓట్లేయడం అందరికీ తెలుసు...! ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వేసే పోస్టల్ ఓట్లు... సరిహద్దుల్లో సైనికులు వేసే సర్వీసు ఓట్లు వంటివి కొంతమందికి తెలుసు..!! అయితే జాబితాలో పేరు లేకపోవడాన్ని చాలెంజ్ చేస్తూ వేసే ఓట్లు.. రహస్య ఏజంట్లు సీక్రెట్ గా వేసే ఓట్ల గురించి చాలా మందికి తెలీదు. అసలు మొత్తం ఓట్లు ఎన్నిరకాలుగా వేయొచ్చో ఈ కథనంలో చూడండి.

పల్లెపోరు: ఒకరి ఓటు ఇంకొకరు వేయవచ్చా..?
పల్లెపోరు: ఒకరి ఓటు ఇంకొకరు వేయవచ్చా..?

By

Published : Feb 2, 2021, 7:12 PM IST

Updated : Feb 2, 2021, 9:22 PM IST

'ఓటు..... ఏముంటుంది ఓ కార్డు తీసుకెళ్లి వేస్తాం... కార్డు లేకపోతే ఓటరు స్లిప్ తీసుకెళ్లి హక్కు వినియోగించుకుంటాం' - ఓ సామాన్యుడి అంతరంగం

'మనతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేస్తారా...? ఎప్పుడు వేస్తారు...అసలు వారికి ఓటు వేసే అవకాశం ఉంటుందా' - ఓ ఓటరుకు వచ్చిన సందేహం.

'సరిహద్దులో దేశ రక్షణ కోసం కంటికి రెప్పలా కాపాడే సైనికులు ఓటింగ్‌లో పాల్గొంటారా..? ఓటు వేస్తే ఎక్కడ వేస్తారు... సొంత రాష్ట్రంలో ఓటు వేసే వెసులుబాటు ఉంటుందా...? లేక అసలు ఓటే వేయరా..?' - ఓ విద్యార్థి మనసులో తట్టిన ప్రశ్న

ఓటు అనే రెండక్షరాలకు దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఉంటుంది. ఆ ఓటే వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో...18 ఏళ్లు నిండినా ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించింది రాజ్యాంగం. మరీ సమాజంలో వివిధ హోదాలో ఉండే వ్యక్తులతోపాటు... కుగ్రామంలో ఉండే సాధారణ వ్యక్తి వరకు ఓటు వినియోగించుకుంటారని తెలుసు..! అయినా అనేక ప్రశ్నలు...సందేహాలు..తికమకలు..!

ఇలాంటి సందేహాలు ఏ ఒక్కరికొ వచ్చేవే కాదు... డిగ్రీలు, పీజీలు చేసిన అక్ష్యరాసులకు సైతం అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. నిజానికి ఓట్లు ఎన్ని రకాలు... ఎవరు ఎక్కడ వినియోగించుకుంటారు..? అందరూ ఓట్లు వేస్తే... ఏర్పాట్లు పరిస్థితి ఏంటీ..? వంటి ప్రశ్నలపై సమగ్ర కథనం

ఓట్ల రకాలు...

సాధారణంగా ఓట్లు 6 రకాలుగా ఉన్నాయి. సాధారణ పౌరుడు ఒక సమయంలో ఓటు హక్కు వినియోగించుకుంటే... ప్రభుత్వ ఉద్యోగులతోపాటు... వివిధ హోదాల్లో ఉండే వ్యక్తులు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసే అధికారులు వివిధ మార్గాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు..

⦁ సాధారణ ఓటు.....

చట్ట ప్రకారం సాధారణంగా 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కు పొందే అవకాశం ఉంది. ఓటు పొందిన వీరు ఎన్నికల్లో నచ్చిన ప్రతినిధికి ఓటు వేస్తారు.

⦁ పోస్టల్‌ బ్యాలెట్‌....

ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఇలాంటి వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం అమల్లో ఉంది. వీరు సాధారణ ప్రజలు ఓట్లు వేయటం కన్నా ముందే తమ ఓటు హక్కును తపాలా బ్యాలెట్‌ పద్ధతిలో వినియోగించుకుంటారు.

⦁ సర్వీస్‌ ఓటు...

దేశ రక్షణ కోసం పహారా కాసే పారామిలటరీ, ఆర్మీలో పని చేసే ఉద్యోగులు తమ సొంత రాష్ట్రంలో కాకుండా... వేర్వురు రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇలాంటి వారూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. వీరిని సర్వీస్ ఓటర్లుగా గుర్తించి ప్రత్యేక పద్ధతిలో ఓటు హక్కు కల్పిస్తారు. ఇందులో సాధారణ సిపాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఉంటారు.

⦁ టెండర్‌ ఓటు....

అప్పటి వరకు జాబితాలో పేరు ఉంటుంది... ఓటు వేసేందుకు బూత్‌ వద్దకు వెళ్తే...అప్పుడుగానీ తెలియదు ఓటు తొలగించారని. ఇది చాలా మందికి అనుభవమే. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓటరు మొదటగా పోలింగ్ అధికారి సాయంతో ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి.

బ్యాలెట్ పేపర్ తరహాలోనే టెండర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దానిపై టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి ఉంటుంది. ఈ పత్రంపై ప్రిసైడింగ్ అధికారి పేరిట ముద్ర ఉంటుంది. ఓటు కోల్పోయిన వ్యక్తి టెండర్ బ్యాలెట్ పేపర్ తీసుకుని... ఓటు వేయదల్చుకున్న అభ్యర్థిపై ముద్ర వేయాలి. అనంతరం ఆ పేపర్​ను ప్రత్యేక కవర్​లో ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి.

ఏదైనా ఒక పోలింగ్ బూత్‌లో 2శాతం కన్నా ఎక్కువ టెండరింగ్ ఓట్లు ఉంటే... జిల్లా ఎన్నికల విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రీ-పోలింగ్ జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి కోరవచ్చు.

⦁ ప్రాక్సీ ఓటు...

దేశ భద్రత వంటి వ్యవహారాలను అంచనా వేస్తూ....సలహాలు, హెచ్చరికలు జారీ చేసే...కేంద్ర నిఘా సంస్థలు, గూఢచారి వంటి విభాగాల్లో పని చేసే వారి ఉనికి ఇతరులకు తెలియకుండా రహస్యంగా ఉంటారు. ఇలాంటి వారు తమ ప్రతినిధిని ఒకర్ని పంపించి ఓటు వేసే అవకాశం పొందవచ్చు. దీన్నే ప్రాక్సీ ఓటు అంటారు.

ఈ తరహా ఓటు విధానం ప్రపంచంలోని అనేక దేశాల్లో అమల్లో ఉంది. మన దేశంలో 2003లో ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ఈ అవకాశం కల్పించింది.

⦁ ఛాలెంజింగ్ ఓటు..

ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్​లోకి వెళ్లిన ఓటరును గుర్తింపు పత్రాలు సరిగా లేవనే కారణంతో పోలింగ్ అధికారి ఓటు వేసేందుకు అంగీకరించకపోతే ఛాలెంజింగ్ ఓటు సహాయపడుతుంది. దీనికోసం పోలింగ్ అధికారి దగ్గర ఉండే 5రూపాయల ఛాలెంజింగ్ ఓటు ఫారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.అనంతరం ఓటరుకు సంబంధించిన ధ్రువపత్రాలను పోలింగ్ అధికారి పరిశీలించి... ఫారం 14లో నమోదు చేసుకుంటారు. ఒకవేళ తప్పుడు సమాచారం అందిస్తే..జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండీ...ముగిసిన తొలిదశ ఎన్నికల నామినేషన్ల పరిశీలన

Last Updated : Feb 2, 2021, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details