వికారాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మైలవరం దేవరాంపల్లి సమీపంలోని లైఫ్ యూనివర్సిటీ వద్ద పురుగులమందు తాగి ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.
అసలేం జరిగింది:
వికారాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మైలవరం దేవరాంపల్లి సమీపంలోని లైఫ్ యూనివర్సిటీ వద్ద పురుగులమందు తాగి ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.
అసలేం జరిగింది:
భర్త, ఇద్దరు పిల్లలను కాదని మరో వ్యక్తితో పరిచయం ఏర్పడగా... ఆమె మోజులో పడి వివాహితతో పాటు ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా దేవరంపల్లి వద్ద చోటుచేసుకుంది. జిల్లాలోని కోట్పల్లి మండలం నాసన్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లావణ్యలకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
ఈ మధ్యకాలంలో లావణ్య... పిల్లలిద్దరిని అదే గ్రామానికి చెందిన శ్రీశైలం వద్దకు కరాటే క్లాసుకు తీసుకెళ్లేది. ఈ తరుణంలోనే లావణ్య, శ్రీశైలం మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి లావణ్య... రెండు రోజుల క్రితం శ్రీశైలంతో కలిసి వెళ్లి మైలార్ దేవరంపల్లి శివారులోని లైఫ్ యూనివర్సిటీ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు.. కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.