TS LITTER TO KRMB: పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపండి: తెలంగాణ లేఖ - పోతిరెడ్డిపాడుపై కేబీఆర్‌కు తెలంగాణ లేఖ
16:02 August 07
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
ఏపీ ప్రభుత్వ.. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందన్న తెలంగాణ.. నాగార్జునసాగర్ నీటి అవసరాల కోసం ఈ తరలింపును ఆపాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలు మాత్రమే వాడుకోవాల్సిన ఏపీ.. ఇప్పటికే 25 టీఎంసీలు వరకు తరలించిందని తెలంగాణ తెలిపింది. నీటిని తరలించకుండా ఆపాలని లేఖలో తెలంగాణ కోరింది.
ఇదీ చదవండి...