ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు - ts coRONA UPDATES

తెలంగాణలో కొత్తగా 1,931 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 86,475కు చేరింది. క్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 665కి చేరినట్లు వైద్యారోగ్య అధికారులు తెలిపారు.

ts-corona-cases-update
తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు

By

Published : Aug 13, 2020, 10:30 AM IST

తెలంగాణలో బుధవారం (12వ తేదీన) 1,931 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 86,475కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 665కి చేరింది. తాజాగా 1780 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 63,074కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,89,150 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 298, జగిత్యాల జిల్లాలో 52 , జనగామలో 59, జోగులాంబ గద్వాల జిల్లాలో 56, కరీంనగర్ జిల్లాలో 89, ఖమ్మం జిల్లాలో 73, మల్కాజ్‌గిరి జిల్లాలో 71, నాగర్‌ కర్నూల్ జిల్లాలో 53, నిజామాబాద్ లో 53, నల్గొండలో 84, పెద్దపల్లిలో 64, సిరిసిల్ల జిల్లాలో 54, రంగారెడ్డి జిల్లాలో 124, సంగారెడ్డి జిల్లాలో 86, సిద్దిపేటలో 71, సూర్యాపేటలో 64, వరంగల్ అర్బన్‌లో 144 కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details