తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ (TELANGANA CM KCR) అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. కేంద్రం.. రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. పంజాబ్‌లో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్నారని.. తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సమాధానం లేదని అన్నారు. తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం... తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
'ఈనెల 18న ఇందిరాపార్క్‌లో తెరాస మహాధర్నా చేస్తాం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు మహాధర్నా నిర్వహిస్తాం. మహాధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. మహాధర్నా తర్వాత గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తాం. ఈనెల 18 తర్వాత రెండ్రోజుల్లో కేంద్రం ప్రకటన చేయాలి. పార్లమెంటులోనూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం.' - కేసీఆర్, తెలంగాణ సీఎం
కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు
ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తామంటే.. కేంద్రం నిరాకరిస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) ఆరోపించారు. కొనుగోలు విషయం నిర్ధరణ కోసం తానే స్వయంగా దిల్లీకి వెళ్లినట్లు వెల్లడించారు. ఏడాదికి రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వినతిపై పరిశీలిస్తామని కేంద్రమంత్రి చెప్పారని... ఐదారు రోజుల్లో జీవోఎంలో చర్చించి తెలుపుతామన్నారని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదని విమర్శించారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటని అడిగామని చెప్పారు.
కేవలం ఎఫ్‌సీఐకి మాత్రమే