వెయ్యేళ్ల క్రితమే మానవులంతా సమానమని చాటిన మానవతావాది, సామాజిక శాస్త్రవేత్త రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు జరగనున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలను ఏర్పాటుచేశారు. 216 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి విగ్రహం వెయ్యేళ్లైనా చెక్కుచెదరని రీతిలో కొలువుదీరిందంటున్న త్రిదండి చినజీయర్ స్వామితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇక్కడకొచ్చిన వారికి పుణ్యం పురుషార్థం దక్కాలనే: త్రిదండి చినజీయర్ స్వామి - statue of equality
రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతాస్ఫూర్తిని చాటారని త్రిదండి చినజీయర్ స్వామి చెప్పారు. సమతామూర్తి సిద్ధాంతాలు నేటి సమాజానికి అవసరమని పేర్కొన్నారు. మానవసేవ మాత్రమే మాధవ సేవ కాదని.. ప్రాణకోటి సంరక్షణతోనే మనిషి ఉనికిని రామానుజాచార్యులు చాటారని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.
త్రిదండి చినజీయర్ స్వామి