బాలయోగికి.. చంద్రబాబు, లోకేశ్ నివాళి - చంద్రబాబు
లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి సేవలను.. తెదేపా స్మరించుకుంది. జయంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ నివాళి అర్పించారు.
బాబు లోకేశ్
లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్లో నివాళి అర్పించారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయికి ఎదిగిన బాలయోగి.. తనకు ఆత్మీయుడని చంద్రబాబు అన్నారు. కోనసీమకు ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. బాలయోగి బలహీన వర్గాల బంధువు అని లోకేశ్ కొనియాడారు.