ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐపీఎస్ అధికారుల బదిలీ - ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మనీష్ కుమార్ సిన్హా నియామకం కాగా... కుమార్ విశ్వజిత్‌కు అనిశా డీజీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

By

Published : Dec 5, 2019, 8:54 AM IST

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ..... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనీష్ కుమార్ సిన్హాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. తెలంగాణా కేడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంపై కేంద్రం నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో.. హోంశాఖ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కుమార్ విశ్వజిత్‌.. అనిశా డీజీగా కొనసాగనున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడిగా..... టి.ఎ.త్రిపాఠీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. జైళ్ల శాఖ డీజీగా ఎహసాన్ రెజాను నియమించారు. నెల్లూరు ఎస్పీగా భాస్కర్ భూషణ్‌ను నియమించిన ప్రభుత్వం... ప్రస్తుత ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పాలనా వ్యవహారాల ఏఐజీగా బదిలీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details