ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MICROSOFT COURCES: రాష్ట్రంలో 1.62 లక్షల మందికి ఉచిత శిక్షణ

రాష్ట్రంలో లక్షా 62 వేల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా శిక్షణ అందించనుంది. దాదాపు 40 రకాల కోర్సులు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.

training-of-microsoft-40-types-of-certification-courses-for-1-dot-62-lakh-people-free-of-cost
రాష్ట్రంలో 1.62 లక్షల మందికి ఉచిత శిక్షణ

By

Published : Oct 5, 2021, 8:27 AM IST

రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో 40 రకాల కోర్సులపై ఉచిత శిక్షణ అందించనుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. ఐటీఐ, ఇంజినీరింగ్‌, సాధారణ డిగ్రీ తదితర 400 విద్యా సంస్థలను ఎంపికచేసి, అక్కడి విద్యార్థులకు ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. 6 నెలల నుంచి ఏడాది పాటు ఉండే ఈ శిక్షణను కొన్ని కోర్సులను ఆన్‌లైన్‌లో, మరికొన్నింటికి ఆఫ్‌లైన్‌లో అందిస్తారు. చివర్లో మైక్రోసాఫ్ట్‌ నిర్వహించే పరీక్షలో అర్హత సాధిస్తే సర్టిఫికేషన్‌ లభిస్తుంది.

కళాశాలలు, విద్యార్థుల ఎంపిక, శిక్షణ నిర్వహణపై ప్రభుత్వం మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గౌతమ్‌రెడ్డితో పాటు 9 మంది సభ్యులతో కమిటీ నియమించింది. సర్టిఫికేషన్‌కు ఒక్కో విద్యార్థి తరపున రూ.350 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఇదే తరహా శిక్షణకు బయటి మార్కెట్‌లో సుమారు రూ.40 వేల వరకు వ్యయం కానుంది. విద్యార్థుల తరపున ప్రభుత్వం సుమారు రూ.28 కోట్లు చెల్లిస్తుండగా.. మిగతా మొత్తాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ భరిస్తుంది.

ఇదీ చూడండి:polavaram:పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ

ABOUT THE AUTHOR

...view details