ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ban on flexi ఫ్లెక్సీల నిషేధంతో పరిశ్రమకు భారీ దెబ్బ

Ban on flexi ప్లాస్టిక్‌ నిర్మూలనలో భాగంగా ఫ్లెక్సీలు నిషేధిస్తున్నాన్న ముఖ్యమంత్రి ప్రకటన వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది రోడ్డున పడే ప్రమాదముందని ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ నిర్వాహకులు వాపోతున్నారు. పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.

Ban on flexi
ఫ్లెక్సీల నిషేధంతో పరిశ్రమకు భారీ దెబ్బ

By

Published : Aug 30, 2022, 10:18 AM IST

Ban on flexi ఫ్లెక్సీ ప్లాస్టిక్‌ కాదని, 180 మైక్రాన్లు కలిగి, రీసైక్లింగ్‌, రీయూజ్‌ (పునర్వినియోగం)కు యోగ్యమైనదని ఆంధ్రప్రదేశ్‌ ఫ్లెక్స్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ నెల్లూరు జిల్లా నాయకులు ఎం.గోపికృష్ణ, రామ్మూర్తినాయుడు పేర్కొన్నారు. ‘ఫ్లెక్సీ ప్లాస్టిక్‌ కాదు.. సీఎం గారూ’ అంటూ సోమవారం నెల్లూరులోని గాంధీబొమ్మ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఫ్లెక్సీ వ్యాపార పరిశ్రమపై లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ నిషేధిస్తున్నామని బహిరంగంగా ప్రకటించారు. ప్రత్యామ్నాయం కల్పించకుండా తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది జీవితాలు చీకటిమయం అవుతాయి. ఈ పరిశ్రమపై ఆధారపడిన వేల కుటుంబాల వారు రోడ్డున పడతారు. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న తరుణంలో సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు. మా అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాల’ని కోరారు. ధర్నాలో నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, గయాజ్‌, శ్రీకాంత్‌, సుభాని, కిరణ్‌, యస్దాని, భార్గవ్‌, వినోద్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమ నిర్వాహకుల్లో ఆందోళన

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం ప్రకటన.. తయారీదారులు, ఆ రంగంలోని కార్మికుల్లో ఆందోళన రేపుతోంది. నిర్వాహకులు బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని యూనిట్లు నెలకొల్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 900కు పైగా ఫ్లెక్సీ తయారీ యంత్రాలున్నాయి. ఒక్కో మిషన్‌పై ఆపరేటింగ్‌, ఫ్లెక్సీ ఫిట్టింగ్‌, ఫోల్డింగ్‌ పనుల్లో 5-10 మంది పని చేస్తున్నారు. సుమారు 50 వేల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఫ్లెక్సీ యూనిట్‌లో ఒక్కో యంత్రం ధర రూ.6 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. ఫ్లెక్సీలను నిషేధించి, వస్త్ర బ్యానర్లు మాత్రమే వాడాల్సి వస్తే, ఈ యంత్రాలను క్లాత్‌ ప్రింటింగ్‌కు అనువుగా మార్చుకునేందుకు రూ.నాలుగైదు లక్షల ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణ ఫ్లెక్సీ చదరపు అడుగు రూ.8-12 మధ్య లభిస్తుంటే.. క్లాత్‌ ఫ్లెక్సీ రూ.35 నుంచి మొదలవుతుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్స్‌ యంత్రాలు మార్కెట్‌లో రూ.12 లక్షలకు లభిస్తుంటే, క్లాత్‌ ఫ్లెక్స్‌ యంత్రాల ప్రారంభ ధరే రూ.25 లక్షల నుంచి ఉంటుందని ఈ రంగంలోని వ్యాపారులు చెబుతున్నారు. వస్త్ర బ్యానర్ల తయారీకి ముడిసరకు, ఇతర ఖర్చులు పెరుగుతాయని అంటున్నారు. గుంటూరుకు చెందిన ఫ్లెక్సీ తయారీదారు నీలా రామసుధీర్‌ మాట్లాడుతూ ‘వినాయక చవితికి కొద్దిరోజుల ముందు నిషేధ ప్రకటన రావడంతో ఆర్డర్లు పడిపోయాయి. సగటున 20-25 ఆర్డర్లు వస్తే.. ఇప్పుడు ఐదే వస్తున్నాయి. ప్రభుత్వం కొంత సమయమివ్వాల్సి ఉంది. యంత్రాల మార్పునకు ఆర్థిక సహకారం అందించాలి’ అని కోరారు.

ఫ్లెక్సీల నిషేధంతో పరిశ్రమకు భారీ దెబ్బ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details