మరోవైపు.. వెంకటాపురం మండలం నుంచి ఆలుబాక, తిప్పాపురం, ఏదిరా తదితర గ్రామాలకు వచ్చే విద్యుత్‌లైన్ ఆలుబాక గ్రామ సమీపంలో 33 కేవీ విద్యుత్ స్తంభం ఉన్న చోటు కుంగిపోయి వంగిపోయింది. వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఆలుబాక గ్రామస్థులు సీఆర్పీఎఫ్ జవాన్లు, విద్యుత్ శాఖ అధికారులు, సర్పంచ్, స్థానికులు శ్రమించి.. స్తంభాన్ని నిలబెట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
వరదల్లో కొట్టుకుపోతున్న ట్రాక్టర్లు.. ఏం చేయలేక బాధలో రైతు - godawari floods
వర్షాలు, వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గోదావరి మధ్యలో ఉన్న లంకలో దుక్కులు దున్ని పొలంలోనే వదిలేసిన ఓ రైతు ట్రాక్టర్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. తన కళ్ల ముందే ట్రాక్టర్లు కొట్టుకుపోతున్నా రైతు ఏమీ చేయలేక మిన్నకుండిపోయాడు.
1