ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOPNEWS: ప్రధానవార్తలు @ 11AM

.

TOPNEWS
ప్రధానవార్తలు

By

Published : Jul 7, 2022, 10:58 AM IST

  • వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు
    Smart Meters for Agricultural Electricity: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలనే అంశం నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. గతేడాది విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికిచ్చే కరెంటును లెక్కించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వారు రాజ్యసభకు నామినేట్ కావటం సంతోషాన్నిచ్చింది: చంద్రబాబు
    రాజ్యసభకు నామినేట్ అయిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు ఇళయరాజాలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు తెలియజేశారు. తమ అపార ప్రతిభతో ప్రజల్ని మంత్రముగ్ధులను చేసిన ఇద్దరు దిగ్గజాలకు తగిన గుర్తింపు లభించిందని వారు వ్యాఖ్యనించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నేరాలకు కేంద్రాలుగా బార్ అండ్ రెస్టారెంట్లు..!
    విజయవాడలో 60 శాతం నేరాలకు బార్ అండ్ రెస్టారెంట్లు కేంద్రంగా మారుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు, దాడులకు వీటిలోనే పథక రచన చేస్తున్నట్లు గుర్తించారు. బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని స్పష్టంచేశారు. నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వీడిన మిస్టరీ.. కూతుళ్లతో కలిసి ప్రియుడి భార్య ఇంటి నిప్పు !
    ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం నెరిపింది.! అతగాడు వేరే పెళ్లిచేసుకోవడంతో రగిలిపోయింది. ప్రియుడిని ఎలాగైనా వశపరుచుకోవాలని దారుణానికి తెగించింది. ప్రియుడి భార్యను కాల్చి బూడిద చేయించింది. కన్నకూతుళ్లతోనే పెట్రోలు పోయించి ఇంటికి నిప్పంటించింది. పరాయి మోజులో పడి.. తనతోపాటు బిడ్డలనూ కటకటాలపాలుజేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • తెలంగాణలో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని !
    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా చినకంజర్ల శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్.. 19వేలకు చేరువలో రోజువారీ కేసులు
    Covid Cases In India: భారత్​లో కరోనా కేసుల భారీగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 2,500కు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. కొత్తగా 18,930 మంది కొవిడ్ బారినపడ్డారు. మరోవైపు, దేశంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'కాళీ' దర్శకురాలి పోస్టుపై ట్విట్టర్‌ కొరడా.. కెనడా మ్యూజియం క్షమాపణలు
    Kaali poster controversy: కాళీ సినిమా పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ట్విట్టర్‌ చర్యలు చేపట్టింది. ఆ పోస్టును భారత్​లో కనిపించకుండా చేసింది. మరోవైపు, ఈ పోస్టర్​ను విడుదల చేసిన అగాఖాన్‌ మ్యూజియం క్షమాపణలు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'వంట నూనెల ధర రూ.10 తగ్గించండి'.. కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
    edible oil price reduce: వంట నూనెల ధరలను లీటర్​కు రూ.10 వరకు తగ్గించాల్సిందిగా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గినందున.. ఆ ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చివరి వింబుల్డన్​లో సానియా ఓటమి.. మ్యాచ్​లో ధోనీ, గావస్కర్ సందడి
    Sania Mirza Wimbledon: భార‌త టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా క‌ల చెదిరింది. ప్ర‌తిష్ఠాత్మ‌క వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ ఛాంపియ‌న్ షిప్‌లో మిక్స్​డ్ డబుల్స్​లో విజేత‌గా నిల‌వాల‌న్న ఆమె కోరిక నెర‌వేర‌లేదు. క్రొయేషియాకు చెందిన పావిచ్​తో క‌లిసి సెమీపైన‌ల్‌కు దూసుకెళ్లిన సానియా ఫైన‌ల్ చేరుకోలేక‌పోయింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి జ‌రిగిన సెమీఫైన‌ల్లో సానియా- ప‌విచ్ జోడీ పరాజయం పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అందుకే 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా: నటుడు వేణు
    Venu Thottempudi About Reentry: 'హనుమాన్​ జంక్షన్​', 'పెళ్లాం ఊరిళితే', 'గోపి..గోపిక.. గోదావరి' వంటి పలు చిత్రాలతో తెలుగు సినీ ప్రియుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. తాజాగా ఆయన నటించిన చిత్రం 'రామారావు ఆన్​ డ్యూటీ'. ఈ నేపథ్యంలో ఎందుకు 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారో వేణు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details