ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Topnews:ప్రధాన వార్తలు @ 5PM - trending news

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Jan 22, 2022, 5:01 PM IST

  • Dhulipalla on Kodali Nani: సవాల్​కు సమయం, సందర్భం ఎప్పుడో కొడాలి తేల్చుకోవాలి: దూళిపాళ్ల

బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే సీఎం జగన్‌ మౌనం వహించడం దేనికి సంకేతమని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సీఎం, డీజీపీ మౌనం చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు. ఇంత వరకు మంత్రిని ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని నిలదీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గుడివాడ క్యాసినో ఘటనపై డీఐజీకి తెదేపా ఫిర్యాదు

గుడివాడ క్యాసినో ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీకి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో.. సిబ్బందికి ఫిర్యాదు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. గుడివాడ ఘటనపై సీఎం జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచారు: తెదేపా నేత పట్టాభి

సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి ముంచారని.. తెదేపా నేత పట్టాభిరాం మండిపడ్డారు. పీఆర్సీ వల్ల ఒక్కో ఉద్యోగి వేతనంలో రూ.2వేల నుంచి 4వేల వరకు కోత పడుతోందని అన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లాఠీ కాఠిన్యం... విచారణ పేరుతో ఎస్సీ మహిళపై చిత్రహింసలు!

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. విచారణ పేరుతో ఎస్సీ మహిళ పై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది. వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ట్రక్కును ఢీకొట్టి బస్సు బోల్తా.. ఐదుగురు మృతి

ట్రక్కును ఢీకొట్టి బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ పసికందు సహా ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఒడిశాలోనా బాలాసోర్​ జిల్లాలో జరిగింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గోదాంలో నక్కి.. ఆరు రోజుల తర్వాత ఆకలితో చిక్కి..

తమిళనాడులోని ఓ గోదాములో నక్కిన చిరుతపులి ఆరు రోజుల తర్వాత అటవీశాఖ సిబ్బందికి చిక్కింది. నెలరోజులుగా జనవాసాల్లో తిరుగుతున్న చిరుతపై రాష్ట్ర అటవీశాఖ సిబ్బంది నిఘా పెట్టారు. అది పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'నేతాజీ సిద్ధాంతాలను ఆచరించడమే అసలైన నివాళి'

దిల్లీ గేటు వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడాన్ని స్వాగతించారు ఆయన మనవడు చంద్రకుమార్​ బోస్​. అన్ని మతాలను కలుపుకుని పోయే నేతాజీ సిద్ధాంతాలను ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురాల్సిన అవసరం ఉందని సూచించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శంషాబాద్ విమానాశ్రయంలో 2.7కిలోల బంగారం స్వాధీనం..

తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 2.7కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కోహ్లీ చెత్త రికార్డు.. ఆ జాబితాలో రెండో స్థానం

టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సార్లు డకౌటైన వారిలో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కంగన పోస్టులు సెన్సార్ చేయాలని పిటిషన్​- తిరస్కరించిన సుప్రీం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్​పై దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆమె సోషల్​ మీడియా పోస్టులను సెన్సార్ చేసేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details