ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - ap latest news

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Nov 18, 2021, 3:03 PM IST

  • కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు
    మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత శివశంకర్​రెడ్డిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • విద్యార్థి సంఘాల ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తం
    ఎయిడెడ్(aided0 విద్యాసంస్థలను యథాతథంగా కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిన్నటి నుంచే విద్యార్థి సంఘాల కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ద నిఘా ఉంచిన పోలీసులు ఉదయం లెనిన్‌ కూడలికి వచ్చిన వారిని నిలువరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నేడే ఆఖరు...వెల్లువలా దరఖాస్తులు
    తెలంగాణలో మద్యం దుకాణాల(application for liquor license)కు భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 16 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండడం వల్ల పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం
    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో ఈరోజు సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'సంపద, ఉద్యోగాలు సృష్టించే వారికి బ్యాంకులు మద్దతివ్వాలి'
    ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటే.. అందుకు కారణం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలేనని ప్రధాని మోదీ అన్నారు(pm modi latest news). సంపద, ఉద్యోగాలు సృష్టించే వారికి బ్యాంకులు మద్దతుగా నిలవాలని సూచించారు(modi news today). పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మధుమేహ రోగుల కోసం ప్రత్యేక 'కుక్కర్​'.. కశ్మీర్​ విద్యార్థుల ఘనత!
    మధుమేహ రోగులు అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయని భయపడుతుంటారు. రోజులో చాలా తక్కువగా అన్నం తీసుకుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేక కుక్కర్​ను(best rice cooker for diabetics) రూపొందించారు కశ్మీర్​ యువకులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సీబీఎస్​ఈ పరీక్షలపై ఆ ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం
    సీబీఎస్​ఈ, సీఐఎస్​సీఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలను(cbse board exam 2021) ఆఫ్​లైన్​తో పాటు హైబ్రిడ్​ మోడ్​లోనూ జరిపేలా ఆదేశించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు(Supreme court). ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కలగజేసుకోవటం సరికాదని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పేటీఎం షేర్లు డీలా- తొలిరోజే భారీ కుదుపు
    దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా (Paytm ipo) స్టాక్​మార్కెట్లో లిస్ట్​ అయిన పేటీఎం తొలిరోజే ఒడుదొడుకులకు లోనైంది. గురువారమే బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్టింగ్​ అయిన ఈ సంస్థ.. ఇష్యూ ధర (Paytm listing price) కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్​ను మొదలుపెట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • భారత్-న్యూజిలాండ్ టీ20 వాయిదా వేయాలని హైకోర్టులో పిల్
    టీమ్​ఇండియా-కివీస్​ రెండో టీ20ని(ind vs nz t20) వాయిదా వేయాలని ఝార్ఖండ్​ హైకోర్టులో ఓ న్యాయవాది పిల్ వేశారు. ఒకవేళ అది కుదరకపోతే 50 శాతం వీక్షకులనే అనుమతించేలా చూడాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నయనతార
    'సైరా'లో మెగాస్టార్ చిరు(chiranjeevi movies) సరసన హీరోయిన్​గా చేసిన నయన్(nayanthara movie list).. ఇప్పుడు సోదరిగా నటిస్తోంది. ఈ విషయం గురువారం రిలీజ్ చేసిన ఓ పోస్టర్​తో ఖరారైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details