ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ ముఖ్యాంశాలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Nov 13, 2021, 3:00 PM IST

  • అమిత్‌ షా పర్యటనలో మార్పులు.. సీఎంతో శ్రీవారి దర్శనం
    కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం తిరుపతికి రాగానే నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. సీఎం జగన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సౌర విద్యుత్ కొనుగోలుకు.. ఏపీ ఈఆర్‌సీ అనుమతి
    సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోళ్లకు AP డిస్కంలకు ఈ.ఆర్​.సీ అనుమతిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 15 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'పంట మార్పిడి అంటే.. మంత్రులను మార్చినంత సులభమా?'
    వరి ధాన్యం కొనుగోలు చేయనని చెప్పిన కేంద్రంపై దిల్లీలో పోరాడాల్సిందిపోయి.. తెలంగాణలో ధర్నాలు చేస్తున్నారని అక్కడి ప్రభుత్వంపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP chief YS Sharmila) మండిపడ్డారు. పంటలు మార్చమని చెబుతున్నారని.. పంట మార్పిడి అంటే.. మంత్రులను మార్చినంత సులభమా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పడమటి దిక్కున వలస కూత..!
    కర్నూలు జిల్లా పడమటి దిక్కున వలసలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉపాధి లేక పిల్లాజెల్లలు, తట్టాబుట్టలు సర్దుకొని ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారు. చాలా మండల్లాలోని పల్లెలన్నీ జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- ఐదుగురు నక్సలైట్లు మృతి
    మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా (gadchiroli encounter today) గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కేరళలో భారీ వర్షాలు- ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    కేరళలో భారీ వర్షాలు (Kerala rain news) కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' (Kerala rain alert) జారీ చేసింది. నవంబర్ 16 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పెళ్లి భోజనం తిని 150 మందికి అస్వస్థత
    కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మహిళా ఖైదీని బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన లేడీ పోలీస్​
    పాకిస్థాన్​లో ఓ లేడీ పోలీస్ అధికారి(pakistan lady police) మహిళా ఖైదీతో అమానవీయంగా ప్రవర్తించింది. జైలులో అందరిముందు ఆమెతో బట్టలు విప్పించి నగ్నంగా నృత్యం చేయించింది. విషయం తెలిసిన పైఅధికారులు ఆ మహిళా పోలీస్​ను విధుల నుంచి తప్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • భారతీయ వైద్యుడికి జెర్సీ బహుకరించిన పాక్ క్రికెటర్
    టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్​కు ముందు అస్వస్థతకు గురైన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్​ ఐసీయూలో చికిత్స తీసుకుని మరీ బరిలో దిగాడు. ఆస్పత్రిలో ఇతడికి వైద్యం చేసింది ఓ భారతీయుడు. మ్యాచ్ అనంతరం ఆ డాక్టర్​ను కలిసిన రిజ్వాన్​.. అతడికి తన జెర్సీ బహుమతిగా అందించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అందుకే బాలయ్యతో సినిమా చేయలేకపోయా: శ్రీను వైట్ల
    దాదాపుగా స్టార్​ హీరోలందరితో సినిమా చేసి హిట్​లు అందుకున్న దర్శకుడు శ్రీనువైట్ల బాలకృష్ణతో సినిమా చేయలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందుకు గల కారణాన్ని తెలిపారు. దీంతో పాటే తన కొత్త సినిమా వివరాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి






ABOUT THE AUTHOR

...view details