ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm - trending news

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Oct 28, 2021, 3:01 PM IST

  • ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్​పై హైకోర్టు ఆగ్రహం

ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్‌కు జరిమానా విధించిన హైకోర్టు... మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయలేదని రాంబాబు అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఎయిడెడ్ పాఠశాలల్ని మూసివేయటం సిగ్గుచేటు'

వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్​ని నాశనం చేసే వాటిని ప్రోత్సహిస్తోందని టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్​గోపాల్ మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా పాలన ‎ తీరు వింతగా ఉందని ఎద్దేవా చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ

ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. నాగార్జునతోపాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో సమావేశమైనట్టు సమాచారం.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మూతపడుతున్న మిల్లులు.. ప్రభుత్వ విధానాలపై మిల్లర్ల అసంతృప్తి

రైతు, ప్రభుత్వం, వినియోగదారునికి మధ్య వారధిగా నిలిచే రైస్‌ మిల్లర్లు.. నెల్లూరు జిల్లాలో గడ్డు పరిస్థితుల(rice millers problems)ను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించలేక, నిర్వహణ చేతకాక అనేక మంది మిల్లులను మూసేస్తున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ట్రాన్స్​ఉమన్​తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...

అమె ఓ ట్రాన్స్​ఉమన్​. తనకు ఇష్టమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడు. కానీ ఆ ప్రేమను వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమను గెలిపించుకునేందుకు వారు పెళ్లి చేసుకున్నారు. ఇదీ తమిళనాడులోని రియా-మనో కథ.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహిళా రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు- ముగ్గురు మృతి

హరియాణాలో దారుణం జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఘటన సమయంలో వీరంతా ఆటో కోసం ఎదురుచూస్తూ డివైడర్​పై కూర్చున్నారని పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆసియాన్​ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం'

ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో (Asean India Summit) వర్చువల్​గా పాల్గొన్నారు. పరస్పర సహకారంతోనే ఆసియాన్​ దేశాలు-భారత్​ మధ్య బంధం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 54 టన్నుల ట్రక్కు, బస్సును సింపుల్​గా లాగేసిన బాహుబలి!

రష్యా బాహుబలి సెర్గెయ్ అగడ్​జాన్యాన్.. అరుదైన ఫీట్ సాధించారు. 53.6 టన్నుల బరువున్న కాన్వాయన్​ను తాళ్లతో తన శరీరానికి కట్టుకొని (Towing Truck) ముందుకు లాగారు. 33 సెకన్లలో 80 సెంటీమీటర్ల మేర కాన్వాయ్​ను లాగి (Towing Vehicle) సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • డికాక్​ క్షమాపణలు.. తర్వాతి మ్యాచ్​లకు అందుబాటులోకి

దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​, బ్యాటర్​ క్వింటన్​ డికాక్.. వెస్టిండీస్​తో మ్యాచ్​ నుంచి తాను ఎందుకు తప్పుకున్నాడో క్లారిటీ ఇచ్చాడు​. తాను అలా చేసినందుకు సహ ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ప్రపంచకప్​లోని తర్వాతి మ్యాచ్​లకు అతడు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నొప్పి భరిస్తూనే ఈ స్టార్స్ నటిస్తున్నారు..!

కొందరు సినిమా తారల జీవితం బయటకు కనిపించినంత అందంగా ఉండదు! అందుకు ఉదాహరణే ఈ స్టోరీ. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? వాళ్లకున్న సమస్యేంటి?పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details