ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - ap top ten news

.

TOP NEWS
ప్రధాన వార్తలు @3PM

By

Published : Oct 14, 2021, 3:00 PM IST

  • ఇంద్రకీలాద్రిపై వైభవంగా.. దసరా మహోత్సవాలు
    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఇవాళ శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపటి తో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాయుడుపాలెంలో మంత్రి కన్నబాబుకు చేదు అనుభవం
    తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాలెంలో మంత్రి కన్నబాబుకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బద్వేలు బరిలో 15 మంది.. అభ్యర్థుల చరిత్ర ఇదే
    కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెదేపాతో పాటు జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో.. వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోరు ఖరారైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల చరిత్రను ఓసారి పరిశీలిస్తే... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోడూరులో యువకుడు దారుణ హత్య
    కృష్ణా జిల్లా కోడూరులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు(Young man murdered at koduru news). పొలంలో మట్టి తరలించే విషయంలో తలెత్తిన ఘర్షణ.. చినికి చినికి గాలి వానలా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయ్ 'సైలెంట్​ పాలిటిక్స్'​
    అధికారిక ప్రకటన చేయకుండానే... స్టార్​ హీరో విజయ్​ 'రాజకీయాలు' మొదలుపెట్టారా? పార్టీ స్థాపించకుండానే.. అభిమాన సంఘం ద్వారానే 'అన్నీ' నడిపిస్తున్నారా? ఔననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సాంబార్​ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య
    మద్యం మత్తులో కన్నతల్లితో పాటు తోబుట్టువుపై దారుణానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. సాంబార్ సరిగా చేయలేదన్న చిన్న కారణంతో.. వారిపై కాల్పులు జరిపి, ప్రాణాలు తీశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అగ్ని ప్రమాదంలో 46 మంది మృతి
    తైవాన్​లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 46 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ తైవాన్‌లోని 13 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సెప్టెంబర్​లో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం
    టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) తగ్గింది. సెప్టెంబర్​లో టోకు ద్రవ్యోల్బణం 10.66 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ సాకర్​ ప్లేయర్ స్టైలే వేరబ్బా..!
    అలెక్స్​ మోర్గాన్ అమెరికా సాకర్ ఫుట్​బాల్ ప్లేయర్​గా మంచి పేరు సంపాదించింది. ఈమె 1989 జులై 2న జన్మించింది. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఈమెకు ఫాలోయింగ్​ కూడా బాగానే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మా' ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అమ్మకే తెలియాలి : హేమ
    ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను నటి హేమ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా నవరాత్రుల్లో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details