ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

.

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

By

Published : Sep 12, 2021, 7:02 PM IST

  • లారీని ఢీ కొట్టి జీపు బోల్తా- ఏడుగురు మృతి
    కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు చిక్కబళ్లాపుర్​లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​-బెంగలూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో కొత్తగా 1,190 కరోనా కేసులు..
    రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 45,533 మంది నమూనాలు పరీక్షించగా 1,190 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 11 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సెల్ఫీ వీడియో ఘటన...రాజీతో సద్దుమణిగిన వివాదం
    రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కడప జిల్లా సెల్ఫీ వీడియో ఘటన రాజీతో సుఖాంతమైంది. భూమిని తిరిగిచ్చేందుకు వైకాపా నేత తిరుపాల్​రెడ్డి కుటుంబం అంగీకరించినట్లు బాధితుడు అక్బర్ బాషా తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వర్శిటీలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు జరపాలి: రాష్ట్ర గవర్నర్‌
    విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు జరపాలన్నారు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్. కొవిడ్‌కు ముందు 3, 4 ఏళ్లకు ఒకసారి స్నాతకోత్సవాలు జరిపేవారన్న ఆయన.. ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే వీసీలకు ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కుమార్తెపై తండ్రి కత్తితో దాడి.. కారణమేంటంటే..?
    కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నకూతురిపైనే తండ్రి దాడికి పాల్పడ్డాడు. కత్తితో హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఆమె గాయపడటంతే.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సోమవారమే సీఎంగా భూపేంద్ర ప్రమాణస్వీకారం
    గుజరాత్​ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్​ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​. ఆదివారం గవర్నర్​ను కలవనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • UP elections 2022: 'మిషన్​ ఉత్తర్​ప్రదేశ్​'లో గెలుపెవరిది?
    త్తర్​ప్రదేశ్​ ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి(up assembly election 2022). వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అగ్రనేతలతో సభలు నిర్వహించి ప్రజల మనసును మరోసారి గెలుచుకోవాలని భాజపా ఆశిస్తుంటే.. అధికార పక్షం అవినీతికి పాల్పడిందంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ 'ప్రగతి' యాత్ర చేపట్టనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అఫ్గాన్​లో సంగీతానికి నో ప్లేస్- దేశం వీడుతున్న కళాకారులు!
    అఫ్గానిస్థాన్​లో సంగీత కళాకారుల(Afghan musicians) పరిస్థితి దయనీయంగా మారింది. గత పాలనలో మాదిరిగానే సంగీతంపై నిషేధం విధిస్తారనే భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. కాబుల్​లోని తమ కార్యాలయాలను మూసివేస్తున్నారు. కళాకారులు, అనుబంధ రంగాల వారు ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • IPL 2021: ఐపీఎల్​లో ఈసారి వ్యాఖ్యాతలు వీరే
    ఐపీఎల్​(IPL 2021) రెండో దశ మ్యాచ్​ల కోసం వ్యాఖ్యాతలు(IPL Commentators) సిద్ధమవుతున్నారు. వారి పేర్లను స్టార్​స్పోర్ట్స్​ ప్రకటించింది. ఇంగ్లీష్​, హిందీ కామెంటేటర్ల పేర్లను ప్రస్తుతం విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బేర్​గ్రిల్స్​తో సాహసాలకు మరో హీరో రెడీ
    మన దేశానికి చెందిన ప్రముఖులు మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్​తో సాహసాలు చేయించిన బేర్ గ్రిల్స్​.. ఇప్పుడు మరో బాలీవుడ్​ హీరోతో స్టంట్​లు చేయించనున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ABOUT THE AUTHOR

...view details