- ఉత్తర్వులను సవాల్ చేసే యోచనలో ఎస్‌ఈసీ!
పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయాలని ఎస్ఈసీ యోచిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- హౌస్ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని
పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తూ.. హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై బుధవారం హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు.. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: చంద్రబాబు
పరిషత్ ఎన్నికల విషయంలో.. హైకోర్టు తీర్పు వైకాపా ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదిగా రుజువైందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- కొత్తగా 1,941 కరోనా కేసులు... ఆరుగురు మృతి
గడచిన 24 గంటల్లో.. రాష్ట్రంలో 1,941 మందికి కొత్తగా కరోనా సోకింది. 835 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 11,809 మంది చికిత్స పొందుతున్నారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- పుదుచ్చేరిలో 77.90శాతం పోలింగ్
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకు 77.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'మే 2న టీఎంసీ కథ కంచికే!'