ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @ 11am

.

top ten news in ap
top ten news in ap

By

Published : May 15, 2020, 11:00 AM IST

  • రూ.కోటి సాధ్యం కాదు..

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వటం సాధ్యం కాదని చెప్పారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • రేపట్నుంచి మొదలు..

రేపట్నుంచి రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి బస్సులు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్​తో హైదరాబాద్​లో ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏపీఎస్​ఆర్టీసీ బస్సులను నడపనుంది.స్పందన పోర్టల్‌లో నమోదైన వారికే ప్రయాణ అవకాశం ఇవ్వనున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • ఆగని పయనం

తినడానికి తిండి లేక, చేయడానికి పని దొరక్క.. ఆదరించే దిక్కులేక.. లక్షలమంది సొంతూళ్ల బాట పడుతున్నారు. మూటాముల్లె సర్దుకుని.. మైళ్ల తరబడి కాళ్లీడ్చుకుంటూ.. గుంపులు గుంపులుగా.. విడతలు విడతలుగా.. మిడతల దండల్లే తరలిపోతున్న వలస జీవులను చూస్తే కొండంత విషాదం! పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • కరోనా పంజా..

గ్రేటర్‌ హైదరాబా ద్​లో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో తాజాగా 40, రంగారెడ్డి శివార్లలో మరో 5 మందికి కరోనా నిర్ధారణ కావడం వల్ల యంత్రాంగం అప్రమత్తమైంది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • 24 గంటల్లో 100 మరణాలు

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 100 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 3,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 81,970కి చేరింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • 8 నిమిషాలు గాల్లోనే!

మనం మాస్క్ ధరించకుండా మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లు గాల్లో 8 నిమిషాలుంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తుంపర్లతోపాటు వైరస్​ కూడా గాల్లో సజీవంగా ఉంటుంది. దీంతో ​వైరస్​ వ్యాప్తి మరింత ఎక్కువవుతుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • నష్టాల బాటలోనే..!

దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • అనుమతిస్తే ఓకే.

కేంద్రం అనుమతిస్తే త్వరలోనే టీమ్​ఇండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్​ సెషన్లు మొదలుపెడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్​ వెల్లడించారు. క్రికెటర్ల ఇంటి వద్దే శిక్షణ కొనసాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • హెల్మెట్ లేకుండానే

1970ల్లో ప్రపంచ క్రికెట్​ సామ్రాజాన్ని శాసిస్తున్న వెస్టిండీస్​ జట్టు గర్వం అణిచేశాడు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్​లో మెరుపు ఇన్నింగ్స్​తో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. నాటి టెస్టు సిరీస్​ గురించి కొన్ని విశేషాల కోసం లింక్ క్లిక్ చేయండి..

  • డించక్ డించక్ డింకా....

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చింది 'రెడ్' చిత్రబృందం. ఈ సినిమాలోని 'డించక్' సాంగ్ టీజర్​ను విడుదల చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details