ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Sep 27, 2022, 9:01 PM IST

  • Animal Husbandry: అక్టోబర్​లో పశువులకు బీమా పథకం: జగన్​
    Jagan on Animal Husbandry: ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన ఆర్గానిక్ పాల ఉత్పత్తిని అధికారులు ప్రోత్సహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం వస్తున్న పాలలో రసాయనాల మోతాదు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం.. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాడి రైతులకు తగిన అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీవారి సాక్షిగా ప్రమాణానికి జగన్​ రెడ్డి సిద్ధమా: నారా లోకేశ్​
    Nara Lokesh Challenge to YS Jagan: వివేకా హత్య కేసులో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తన కుటుంబానికి వివేకా హత్య కేసు సంబంధం లేదని గతంలో తాను ప్రమాణం చేసిన విషయాన్ని లోకేశ్​ గుర్తు చేశారు. హత్య కేసులో సంబంధం లేదని సీఎం జగన్​ ప్రమాణం చేయాలని సవాల్​ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్​కు దోపిడీ తప్ప మరో ఆలోచన లేదు: భాజపా
    Kanna Lakshminarayana on jagan: మూడున్నరేళ్లుగా దోపిడీ తప్ప సీఎం జగన్‌కు మరో ఆలోచన లేదని.. భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలవరాన్ని గాలికొదిలేసిన జగన్‌.. రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదు.. విశాఖలో భూములు కాజేసేందుకు వైకాపా నాటకాలు: అచ్చెన్నాయుడు
    Atchannaidu: రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని స్థితికి కారణం వైకాపా పాలకులు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నారు. వైకాపాకు ప్రాంతాల, కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందటం అలవాటేనని విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈడబ్ల్యూఎస్‌​ రిజర్వేషన్లపై 'సుప్రీం' విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు
    EWS Supreme Court : ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ 40 వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు రాగా.. వీటిపై విచారణ పూర్తి చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. నిజమైన శివసేన ఎవరిదో తేల్చే బాధ్యత ఈసీదే
    Shiv Sena Symbol Row : మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన గుర్తు కేటాయింపుపై నిర్ణయం తీసుకోకుండా ఈసీని ఆపాలంటూ ఠాక్రే వర్గం చేసిన విజ్ఞప్తిని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఊరికే చెప్పడం లేదు.. అణుబాంబు వేసి తీరుతాం!'.. రష్యా హెచ్చరిక
    Russia Nuclear Threat : అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా మరోసారి హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు వాటిల్లితే ఉక్రెయిన్​పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాహన బీమా పాలసీలో కొత్త టెక్నాలజీ.. తక్కువ ప్రీమియంతోనే..
    'అందరికీ ఒకే పాలసీ' అనేది ఒకప్పటి మాట. పాలసీదారుల విస్తృత అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారికోసం ప్రత్యేకంగా పాలసీలను అందించడానికి ఇప్పుడు సాధారణ బీమా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా.. తమ వినియోగదారులకు పాలసీలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. మెరుగైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND VS SA: సఫారీతో ఢీ.. జోరు మీదున్న టీమ్​ఇండియా.. కానీ అదొక్కటే
    మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలిపోరు రేపు తిరువనంతపురం వేదికగా జరగనుంది. టీ20 సిరీస్‌లో ఆసీస్‌పై నెగ్గిన టీమ్​ఇండియా.. దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరు ప్రదర్శించాలని కోరుకుంటోంది. బుధవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలుపై ఓ లుక్కేద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జబర్దస్త్​ కమెడియన్​ కన్నుమూత.. ఆ సమస్యతో!
    అనారోగ్య సమస్యలతో జబర్దస్త్ ఫేమస్ నరసింహమూర్తి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details