- Accident: కల్వర్ట్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
Accident: విజయనగరం జిల్లాలో దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు.. నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఢీకొట్టి రహదారి పక్కనే ఉన్న గొయ్యిలోకి బోల్తాపడింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మార్పు చూపించాం.. మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం: సీఎం జగన్
రాజకీయ వ్యవస్థలో వైకాపా ప్రభుత్వం మార్పు చూపించిందని.. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేయగలిగాం అని అన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశామన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు చేతలతోనే సమాధానం ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైకాపా ప్లీనరీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగనే శాశ్వత అధ్యక్షుడా.. అదేం పార్టీ?: చంద్రబాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైకాపా ప్లీనరీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఉండటంపై విమర్శించిన చంద్రబాబు.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
కోస్తాలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ భారీ వర్షంపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమర్‌నాథ్ వరద బీభత్సం.. 13 మంది మృతి.. 40 మంది గల్లంతు
అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో వరద బీభత్సం సృష్టించింది. యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటుచేసిన 3 వంటశాలలు, 25 గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది. ఈ విపత్తులో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాక్ అమ్మాయి- భారత్ అబ్బాయి.. సరిహద్దులు దాటి చిగురించిన ప్రేమ
భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉన్నా.. నిజమైన ప్రేమకు అవేమీ అడ్డురావడం లేదు. రెండుదేశాల మధ్య వైరాన్ని పక్కకుతోసి పాకిస్థాన్ అమ్మాయి-జలంధర్ అబ్బాయి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ట్విట్టర్ డీల్ నుంచి ఎలాన్ మస్క్ ఔట్.. కోర్టుకు వెళ్తామన్న సంస్థ
ELON MUSK TWITTER DEAL: ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ట్విట్టర్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. మరోవైపు, ఈ నిర్ణయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మలేసియా మాస్టర్స్ సెమీస్లోకి ప్రణయ్.. నిరాశపరిచిన సింధు
Malaysia masters super 500: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ జపాన్ స్టార్ కంటా త్సునెయమాపై గెలిచి సెమీఫైనల్ చేరగా..డబుల్ ఒలింపిక్ విజేత పీవీ సింధు ఓటమి పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కథానాయకులు బిజీ బిజీ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
కరోనా తర్వాత వరసగా సినిమాలు పట్టాలెక్కడంతో చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. ఏటా ఒక్క చిత్రమే కష్టంగా మారిన తరుణంలో పెద్ద, చిన్న హీరోలు ఈసారి పంథా మార్చారు. చాలా మంది కథానాయకులు రెండు మూడు సినిమాలతో సందడి చేసేస్తున్నారు. ఇంతకీ వారు ఎవరు? ఏ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు? తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధానవార్తలు