- పదవీ విరమణ ప్రయోజనాలు దక్కక ఇక్కట్లు...రూ.800 కోట్ల వరకు పెండింగ్
పదవీ విరమణ ప్రయోజనాలు సమయానికి అందక రాష్ట్రంలో చాలామంది విశ్రాంత ఉద్యోగులు సతమతమవుతున్నారు. పీఎఫ్, ఇతర సొమ్ములు ఎన్నాళ్లయినా జమ కావడం లేదు. పదవీ విరమణ చేసినవారికి ప్రభుత్వం చెల్లించాల్సింది సుమారు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇతర బకాయిలూ కలిపితే రూ.2,100 కోట్లు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సమ్మెదిశగా ఉద్యోగుల అడుగులు... ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సమాయత్తం
ఉద్యోగులు సమ్మెబాట పడితే...ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్టీసీ, విద్యుత్ లాంటి కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామని ప్రకటించడంతో..ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అత్యవసర విధులు నిర్వహించాల్సిన శాఖల ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఎస్మా ప్రయోగించే అంశంపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- hc on girl treatment : ఆ బాలికకు ఉచిత వైద్యం అందించాలి
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికకు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చికిత్స ఖర్చులను సమకూర్చేందుకు క్రౌడ్ ఫండింగ్ సహా అన్ని మార్గాలనూ అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొత్త జిల్లాల్లో మార్పులు చేయాలంటూ ఆందోళనలు.. ధర్నాలు... శిరోముండనాలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ల మార్పులతో పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రకటించిన వాటితో కాకుండా తమ ప్రాంతాలతోనే ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని..ఆయా సంఘాలు, ప్రజలు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'నేరగాళ్లను పోటీ చేయనీయొద్దు'
ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటుంటే.. వారిని అనర్హులుగా గుర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలని 2020లో ఓ పిల్ దాఖలైంది. అయితే ఆ పిల్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకారం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కాంగ్రెస్‌లో వలస వేదన- ప్రియాంకా గాంధీకి కఠిన పరీక్ష