ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1pm

.

ప్రధాన వార్తలు @ 1pm
ప్రధాన వార్తలు @ 1pm

By

Published : Nov 14, 2021, 1:00 PM IST

  • మా పాలనలో.. వారంతా రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా
    అంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన హోం మంత్రి.. నెల్లూరులో జరుగుతున్న స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు కూడా రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 14వ రోజూ ఉత్సాహంగా.. అమరావతి మహాపాదయాత్ర
    అమరావతి రైతుల మహాపాదయాత్ర 14వ రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా యరజర్ల శివార్లలో ఈ రోజు యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులకు స్థానిక రైతులతోపాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రశాంతంగా సాగుతున్న.. స్థానిక ఎన్నికల పోలింగ్
    స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండడంతో.. ఓటర్లందరూ త్వరగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో.. త్వరలో రిజిస్ట్రేషన్లు
    భూముల రీ-సర్వే పూర్తయిన 51 గ్రామాల్లో ప్రభుత్వం త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. ‘వన్‌ టైం సెటిల్‌మెంట్‌’ కింద రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాన్ని వార్డు/గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'గడ్చిరోలి'​ మృతుల్లో నక్సల్​ టాప్​ కమాండర్​ తుంబ్డే
    మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల(gadchiroli encounter) మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్​ తేల్​తుంబ్డే సహా.. మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • తల్లిని సర్పంచ్​ చేసిన ఊరికి ఎన్​ఆర్​ఐ గిఫ్ట్​.. రూ.కోటితో..
    రూ. కోటితో తన గ్రామంలో ఆధునిక గ్రామ పంచాయతీ భవనాన్ని(gram panchayat building) నిర్మించారు ఓ ఎన్​ఆర్​ఐ. తన తల్లిని సర్పంచ్​గా(gram sarpanch) ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటన రాజస్థాన్​, బాడ్​మేర్​ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'కరోనా వేళ చిన్నారుల్లో పెరిగిన ఊబకాయం'
    కరోనా ముందుతో పోలిస్తే ఆ తరవాత ఎక్కువగా పిల్లలు ఊబకాయం(Obesity in children) బారినపడ్డారు. ఈ మేరకు దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యుల అధ్యయనంలో తేలింది. ఎక్కువ సమయం పని చేయకుండా కూర్చోవడం, ఒత్తిడి, సరైన నిద్రావేళలు పాటించకపోవడం వల్ల పిల్లలు బరువు పెరిగారని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కాప్26 ఒప్పందానికి ఆమోదం- భారత్ ఒత్తిడితో మారిన లక్ష్యాలు!
    కాప్26 (COP26 news) వాతావరణ సదస్సులో (COP26 Glasgow) కుదిరిన ఒప్పందాన్ని 200 దేశాలు ఆమోదించాయి. పలు సమస్యలు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే ఒప్పందం (COP26 2021) మంచిదేనని అమెరికా, చైనా (COP26 US and China) దేశాలు పేర్కొన్నాయి. బొగ్గు వాడకంపై చివరి నిమిషంలో భారత్ చేసిన ప్రతిపాదనపై మాత్రం పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా?
    ప్రస్తుత టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో టాస్ కీలకపాత్ర పోషిస్తోంది. యూఏఈ పిచ్​ల్లో రాత్రి పూట మంచు ప్రభావమే అందుకు కారణం. అందుకే టాస్(t20 world cup 2021 toss results) గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కెప్టెన్లు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రేయసితో స్టార్​ నటుడి నిశ్చితార్థం
    బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావుకు తన ప్రేయసి, నటి పత్రలేఖతో నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్​ అవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details