ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM

.

9am top news
ప్రధాన వార్తలు @9AM

By

Published : Sep 29, 2021, 9:00 AM IST

  • RAINS: తగ్గని వరద ఉద్ధృతి..
    గులాబ్ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అకాల వర్షాలతో రైతులు లక్షల ఎకరాల్లో పండించిన పంటను కోల్పోయారు. వరద ఉద్ధృతికి నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా కురిసిన వరదలకు ప్రజా జీవితం అతలాకుతలమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేడు, రేపు వర్షాలు కరిసే అవకాశం
    వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపూ వర్షాలు కరిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జనసేన - వైకాపా మధ్య మాటల యుద్ధం..
    జనసేన - వైకాపా మధ్య విమర్శలు.. ప్రతివిమర్శల దాడి పతాక స్థాయికి చేరుకుంది. ట్వీట్లు... రీట్వీట్లు.. వ్యాఖ్యలు.. కౌంటర్లతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బద్వేలు ఉప ఎన్నికకు అంతా సిద్ధం
    బద్వేల్ ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. వైకాపా తరఫున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధ పోటీ చేస్తుండగా... తెదేపా నుంచి గతంలో ఓడిన రాజశేఖర్‌ రంగంలోకి దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జోజిలా సొరంగం నిర్మాణంలో సవాళ్లెన్నో!
    కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ కశ్మీరులో నిర్మాణాలు చేపడుతున్నారు నిపుణులు. ఈ జోజిలా సొరంగం(Zozila Tunnel) నిర్మాణంలో ​తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్నికలకు ముందే ప్రాజెక్టులు పూర్తి: నితిన్​ గడ్కరీ
    రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై చేపట్టిన జడ్‌మోర్‌, జోజిలా సొరంగాల పనులపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జైలులో గ్యాంగ్​ వార్​.. 24 మంది ఖైదీలు మృతి!
    ఖైదీల మధ్య వివాదం హింసాత్మకంగా(prison riots) మారింది. బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకోవటం వల్ల 24 మంది మరణించారు. ఈ ఘటన ఈక్వెడార్​లోని గుయాక్విల్​ ప్రాంతీయ జైలులో(ecuador prison riots 2021) జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు కోసం కృషి '
    'కొవాగ్జిన్‌'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర గుర్తింపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు భారత్​ బయోటెక్​ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు ఎప్పుడు వస్తుందనే విషయంలో ఊహాగానాలు, అంచనాలు సరికాదని వ్యాఖ్యానించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజ!
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Movies), మాస్ మహారాజ రవితేజ(Ravi Teja Latest Movie).. ఒకే స్క్రీన్​పై సందడి చేయనున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 154వ సినిమాలో రవితేజ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IPL 2021: 300 వికెట్ల క్లబ్​లో పొలార్డ్​
    ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ కీరన్​ పొలార్డ్​.. టీ20 ఫార్మాట్​లో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 300 వికెట్లు తీసిన (Pollard Ipl Wickets)ఆటగాడిగా రికార్డులకెక్కాడు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details