- 60శాతం మార్కుల నిబంధన వర్తించదు:హైకోర్టు
జూనియర్ సివిల్ జడ్జి నియామకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. బీసీలకు ఓసీలతో పాటు 60శాతం మార్కులనే నిబంధనపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- CM jagan : అమెరికన్ కార్నర్ ప్రారంభం
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్‌ను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. యూఎస్ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం ఈ కార్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తితిదే ఛైర్మన్ పేరుతో మోసం
తిరుమలలో దళారులు రోజు రోజుకూ కొత్తరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తులకు తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి అంటూ నఖిలీ సిఫార్సు సందేశాలను పంపి మోసగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మావోయిస్టు వారోత్సవాలు
ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల(Maoist avirbhava week-celebrations)లను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు నిర్వహించిన ప్రజా మేళిలో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పెగసస్‌పై సాంకేతిక నిపుణుల కమిటీ'
పెగసస్ నిఘా(Pegasus snooping row) వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది సుప్రీం కోర్టు. కమిటీ ఏర్పాటుపై వచ్చే వారం ఉత్తర్వులు వెలువరించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్‌రేప్
దేశంలో రోజురోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి.. ముగ్గురు కిరాతుకులు సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. కాగా ఝార్ఖండ్‌లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్‌ఫాదర్) అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆకస్' కూటమిలోకి భారత్
ఇండో- పసిఫిక్ ప్రాంత భద్రత కోసం ఇటీవల ఏర్పాటు చేసిన 'ఆకస్' కూటమిలో(aukus alliance) భారత్ చేరనుందా? చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలతో జట్టుకట్టనుందా? భారత్ చేరికపై అగ్రరాజ్యం సమాధానం ఏమిటి?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓయో మరో ముందడుగు?
భారీగా నిధులు సమీకరించే లక్ష్యంతో.. 'ఓయో' ఐపీఓకు (OYO IPO size) వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ వాటాదార్లు ఐపీఓకు ఆమోదం తెలపగా.. ఆ దిశగా మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ!
న్యూజిలాండ్ పర్యటన రద్దుతో పాకిస్థాన్‌పై (NZ vs PAK) తీవ్ర ప్రభావం పడింది. ఇతర జట్లపైనా ఆ ప్రభావం ఉంటుందని తీవ్ర అసహనంతో ఉన్న ఆ జట్టుకు.. కివీస్ పర్యటన కోసం చేసిన ఏర్పాట్ల వ్యయం భారంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' బ్యూటీ!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' చిత్రం(Salaar Movie Updates) రూపొందుతోంది. ఇందులో ఓ కీలకపాత్ర కోసం 'బిగ్‌బాస్' ఓటీటీ(Bigg Boss OTT Winner) విజేత దివ్యా అగర్వాల్‌ను(Divya Agarwal News) సంప్రదించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @1PM