- 'సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంటారా?'
ఏపీలో రోజుకో అమానవీయ ఘటన జరగటం దురదృష్టకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు, బాధలు ఎవరితో చెప్పుకోవాలని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పూతరేకులకు తపాలాశాఖ గుర్తింపు
ఆత్రేయపురం పూతరేకులపై తపాలాశాఖ పోస్టల్ కవర్ విడుదల చేసింది. విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు దీనిని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్ కవర్ అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధరణికోట ఇసుక స్టాక్ యార్డు వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన
గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట ఇసుక స్టాక్ యార్డు వద్ద ఇసుక లోడింగ్ విషయంలో జేపీ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు.. లారీ డ్రైవర్లకు మధ్య వివాదం నెలకొంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు..
మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బస్సు వెళ్తుండగా విరిగిపడిన కొండ.. ఆ తర్వాత?
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వీర్ భట్టీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో 14 మంది ప్రయాణికులతో కేఎంఓయూకు చెందిన బస్సు అల్మోరా నుంచి హల్దివానికి వెళ్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెళ్లిళ్లకు భారీ డిమాండ్.. ఎగబడ్డ జంటలు
ముందు తమకంటే.. తమకు ముందు వివాహం జరిపించాలని రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. పెళ్లిళ్లకు డిమాండ్‌తో.. ఆలయానికి జంటలు భారీగా తరలివచ్చాయి. దీంతో ఆలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు విడుదల
అఫ్గానిస్థాన్‌లోని ప్రజలపై అరాచకత్వాన్ని ప్రదర్శిస్తున్న తాలిబన్లు.. సాటి ఉగ్రవాదులపై మాత్రం ప్రేమ కనబరుస్తున్నారు. అఫ్గాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వంద మందికి పైగా ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమిస్తాం'
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్బీఐ. ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వేలంలో నీరజ్ జావెలిన్, సింధు రాకెట్, లవ్లీనా గ్లోవ్స్
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్ల క్రీడా వస్తువులను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే నీరజ్ చోప్డా జావెలిన్, లవ్లీనా బాక్సింగ్ గ్లోవ్స్, పీవీ సింధు రాకెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తీసుకున్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మా' గురించి మంచు విష్ణు పోస్టు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకున్నారు మంచు విష్ణు. 'మా' కల త్వరలో నెరవేరనుందని అందులో పేర్కొన్నారు. దీంతో అందరి దృష్టి మరోసారి 'మా' ఎన్నికలపై పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @3PM