ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 10, 2021, 1:00 PM IST

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

ప్రధాన వార్తలు @ 1 PM

1pm top news
ప్రధానవార్తలు @1PM

  • CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్!
    ముఖ్యమంత్రి జగన్(cm jagan) ఈ నెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును(polavaram project) సందర్శించనున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి బ్యాక్ వాటర్(godavari back water) ప్రభావం, ముంపు గ్రామాలు, నిర్వాసితుల అంశంపై ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనన్నట్టు సమాచారం..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర తెలుగు అకాడమీ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..!
    తెలుగు అకాడమీ పేరు మారుస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు - సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Payyavula released letter: 'రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై కేంద్రానికైనా సమాధానం చెప్పాలి'
    ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని లేఖతో స్పష్టమైందని పయ్యావుల అన్నారు. రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై కేంద్రానికైనా సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అడవితల్లితోనే మా బతుకులు.. లేటరైట్ తవ్వుకుంటామంటే ఎలా?'
    విశాఖ జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన లేటరైట్‌ ఖనిజ నిక్షేపాలున్నాయి. అవన్నీ అయిదో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి. గిరిజనుల పేరిట కొందరు పెద్దలే వాటిని దక్కించుకుంటూ దందా నడిపిస్తున్నారు. స్థానిక ఆదివాసీలకు డబ్బులు ఆశచూపి తమవైపు తిప్పుకొంటున్నారు. కొందరు ప్రలోభాలకు లొంగిపోతుంటే మరికొందరు ఎదురొడ్డి పోరాడుతున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సౌండ్​ చేశారో.. హారన్లు రోడ్డురోలర్​​ కిందకే!
    బైకులకు పెద్దగా శబ్దం వచ్చేలా హారన్లు, సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని రయ్​ రయ్​ మంటూ దూసుకుపోవలనిపిస్తోందా? అలాంటి సాహసం చేయాలనుకుంటే ఇబ్బందులపాలైనట్లే. ఎవరైనా అలాంటి హారన్లు, సైలెన్సర్లు వాడితో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాటిని గుర్తించి రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాల్పుల విరమణతో ఉగ్రవాదానికి 'సంకెళ్లు'!
    భారత్​-పాకిస్థాన్​ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో కుదురిన కాల్పుల విరమణ ఒప్పందంతో కశ్మీర్​లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టినట్టు కనపడుతోంది. గతేడాది జులైతో పోల్చుకుంటే ఈ ఏడాది అదే కాలానికి ఉగ్రవాదుల మరణాలు 48శాతం తగ్గాయి. ఉగ్రవాద సంబంధిత ఘటనలు కూడా 16శాతం తగ్గాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • '2024 నాటికి 60వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం'
    దేశంలో 60వేల కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల నిర్మాణమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరి వెల్లడించారు. రోజుకు 40కిలోటమీర్ల చొప్పును రోడ్లను నిర్మించాలని తలపెట్టినట్టు స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రిచ్' రోదసి​ ప్రయాణానికి రంగం సిద్ధం
    ఆదివారం న్యూ మెక్సికోలోని ప్రైవేటు స్పేస్​ పోర్టు నుంచి నింగిలోకి ఎగరనున్నారు బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్​ బ్రాన్సన్​. సుమారు 90 నిమిషాల పాటు ఈ యాత్ర సాగనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 10వేల పరుగులతో చరిత్ర సృష్టించి- క్రికెట్​లో చెరగని ముద్ర వేసి
    భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్​గా విశేష సేవలందించిన లిటిల్​ మాస్టర్​ సునీల్​ గావస్కర్​ పుట్టిన రోజు(Sunil Gavaskar) నేడు. టెస్టులకు కేరాఫ్​గా నిలిచిన సన్నీ.. అనేక రికార్డులు నెలకొల్పాడు. శనివారం 72వ పడిలోకి అడుగుపెట్టాడు గావస్కర్​.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాత్ర ఏదైనా విలక్షణ నటనతో మెప్పించిన 'కోట'
    కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa rao). తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన కోట శ్రీనివాసరావు పుట్టిన రోజు నేడు. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కోట పాత్రలపై ఓ లుక్కేద్దాం..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details