ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 7, 2021, 1:00 PM IST

ETV Bharat / city

ప్రధానవార్తలు @1PM

..

TOP NEWS
ప్రధానవార్తలు @1PM

  • cm jagan: నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై సీఎం సమీక్ష
    విద్యాశాఖలో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్(cm jagan) సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద బడులను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • PAWANKALYAN: సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే ప్రధాన లక్ష్యం: పవన్‌
    కరోనా(corona) విపత్తుతో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్(pawan kalyan) అన్నారు. జనసైనికులు, వారి కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారన్నారు. జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమేని పవన్ అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • పూరిల్లు దగ్దం.. కాలి బూడిదైన రూ. 5 లక్షలు
    కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.5లక్షల రూపాయలు మంటల్లో పూర్తి కాలిపోయాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • అనకాపల్లిలో వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు
    విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటర్​ఛేంజ్ వంతెన కూలిన ఘటనపై కేసు నమోదైంది. దిలీప్‌ బిల్డ్‌కాన్‌ యాజమాన్యం, సైట్‌ ఇన్‌ఛార్జి, జనరల్‌ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • మమతా బెనర్జీకి చుక్కెదురు- జరిమానా విధించిన హైకోర్టు
    బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి కోల్​కతా హైకోర్టు రూ. 5లక్షల జరిమానా విధించింది. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారని ఈ మేరకు తీర్పునిచ్చింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • 'మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోంది'
    మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోందని ట్విట్టర్​ వేదికగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. దిల్లీలో పెట్రోల్​ ధర రూ.100 దాటిన క్రమంలో ఈ మేరకు దుయ్యబట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • Vaccination: కరోనా టీకా​ తీసుకున్నవారికే రేషన్​!
    టీకా పంపిణీని విస్తృతం చేసేందుకు కర్ణాటకలోని శరేవడా గ్రామ సర్పంచ్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకా తీసుకుంటే కానీ రేషన్​ అందించేది లేదని నిబంధన విధించారు. టీకా తీసుకున్నట్టు రసీదు ఉంటేనే రేషన్​ అందేలా ఏర్పాటు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • 'వారాంతానికి 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తి'
    ఈ వారంతానికి అమెరికాలో పూర్తి స్థాయిలో కరోనా టీకా(Corona vaccine) అందుకున్నవారి సంఖ్య 160 మిలియన్లకు చేరుతుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)​ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కొవిడ్-19​(Covid-19) కేసులు, మరణాలు 90 శాతం మేర తగ్గాయన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • MS Dhoni: 'కూల్'​గా మాయ చేసిన మహేంద్రుడు!
    కెప్టెన్​ కూల్​గా తనదైన నాయకత్వ పటిమతో టీమ్ఇండియాకు అద్భుత విజయాలు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 16 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో టీ20 ప్రపంచకప్​తో పాటు, వన్డే వరల్డ్​కప్​, ఛాంపియన్​షిప్​ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలను భారత ఖాతాలో చేర్చాడు. బుధవారం మహి పుట్టిన రోజు సందర్భంగా అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్​లు మీ కోసం..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • Dilip Kumar: 'ట్రాజెడీ కింగ్'​ సినీ ప్రస్థానం సాగిందిలా..!
    బాలీవుడ్​గా పిలుచుకునే హిందీ సినిమాకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆయన. నటన అంటే కేవలం డైలాగులు బాగా చెప్పటమే అనుకునే రోజుల్లో నటుడంటే ఆ పాత్రను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేవాడు అని పరిచయం చేసిన వ్యక్తి ఆయన.పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి గొడవలున్నా భారత్, పాక్ రెండూ ఆయన్ను అమితంగా ప్రేమించి అత్యున్నతంగా గౌరవించుకున్నాయంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details