- హైవే కిల్లర్ మున్నా కేసులో సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష
కరుడుగట్టిన హంతకుడు. కోడిని చంపినంత తేలిగ్గా మనుషుల పీకలు తెగ్గోస్తాడు . శవాల్ని గోనెసంచుల్లో కట్టి దగ్గర్లోని కాల్వల వద్ద పూడ్చేస్తాడు. ప్రకాశం జిల్లా హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు 8వ అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు
విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు వెలిశాయి. ఇందులో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. కరోనా ఉద్ధృతి వేళ.. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపాన్‌గా మారిందని అమరావతి వాతావరణ సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '18 ప్లస్'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్!
18 నుంచి 44 ఏళ్లవారికి కొవిడ్ టీకా కోసం.. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే కొవిన్ పోర్టల్‌లో నమోదుకు అనుమతిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల వృథాను తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ బాధితులకు పరిహారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు!
కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జర్నలిస్ట్ మీదకు యుద్ధ విమానం పంపి అరెస్ట్