ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @7PM - ap top ten news

.

top news
top news

By

Published : May 16, 2021, 7:05 PM IST

Updated : May 16, 2021, 7:25 PM IST

  • హై టెన్షన్: గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామ తరలింపు

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో తాజాగా మరో ట్విస్ట్ ఎదురైంది. రఘురామను గుంటూరు జైలుకు తరలించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే..జైలు నుంచి రమేశ్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. మరోవైపు తన భర్తకు ప్రాణహాని ఉందని.. ఈ రాత్రికి జైలులో దాడి చేస్తారనే సమాచారం ఉన్నట్లు రఘురామ భార్య రమ చెబుతున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు.. పోలీసులకు చిక్కాడు!

ఆ కిరాణా దుకాణంలో 30 ఏళ్లు నమ్మకంగా పని చేశాడు. అక్కడ అనువణువు అతనికి తెలుసు. దుకాణ యజమాని దేవుని గదిలో ఉంచిన భారీ బంగారు వస్తువులపై కన్ను పడింది. పాత నేరస్థుడి సాయంతో చోరీకి పాల్పడి 80కి పైగా తులాల బంగారు వస్తువులు కాజేశారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో కొత్తగా 24,171 కరోనా కేసులు, 101 మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 94,550 నమూనాలను పరీక్షించగా... 24,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మోదీని విమర్శిస్తూ పోస్టర్లు- 25మందిపై ఎఫ్​ఐఆర్​

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఘటనలో దిల్లీ పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భారత్​ బయోటెక్​తో హెస్టర్​ చర్చలు

టీకా ఉత్పత్తికి సాంకేతికత బదిలీపై భారత్​ బయోటెక్​తో హెస్టర్​ బయోసైన్సెస్​​ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు మార్లు చర్చలు జరిగాయి. వ్యాక్సిన్​ ఉత్పత్తి కోసం హెస్టర్​ బయోసైన్స్​ గుజరాత్​ ప్రభుత్వంతో జట్టు కట్టింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జనాభా వృద్ధిలో క్షీణత- ఆ దేశాలకు ఇక కష్టాలేనా?

చైనా, అమెరికాలో జనాభా వృద్ధి నెమ్మదించింది. జపాన్​లో పిల్లల జనాభా 40ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇటలీలో జనాభా వృద్ధిలో తగ్గుదలపై పోప్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో జనాభా తగ్గడానికి కారణాలేంటి? ప్రజల జీవనశైలిలో మార్పుల వల్లేనా? వారి ఆలోచనా ధోరణి మారిందా? ఇలానే కొనసాగితే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'గాజా'పై ఇస్లాం నేతల అత్యవసర సమావేశం

ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య దాడులు కొనసాగుతున్న వేళ ఇస్లాం మత పెద్దలు అత్యవసరంగా సమావేశమయ్యారు. గాజాపై ఇజ్రాయెల్​ దాడులు ఆపేలా చూడాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రైల్వే మైలురాయి- 6,000 స్టేషన్లలో ఉచిత వైఫై

రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు మరో మైలురాయిని దాటాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,000 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ సేవలను 2016లో ప్రారంభించింది రైల్వే శాఖ.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎగ్జామ్స్​ ఓవైపు.. షూటింగ్​ పోటీలు మరోవైపు

క్రొయేషియాలో షూటింగ్​ పోటీల్ని, పరీక్షల ప్రిపరేషన్​ను ఏకకాలంలో నిర్వర్తిస్తూ ఆహా అనిపిస్తోంది యువ షూటర్ మను బాకర్. తన పోటీల సమయంలోనూ, బీఏ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నెటిజన్​ను సర్​ప్రైజ్​ చేసిన 'జాతిరత్నాలు' నవీన్

తనను ట్యాగ్​ చేసిన ట్వీట్ పెట్టిన ఓ నెటిజన్​ను సర్​ప్రైజ్​ చేశారు జాతిరత్నాలు ఫేమ్ నవన్ పొలిశెట్టి. ఇంతకీ ఏంటా సర్​ప్రైజ్? నవీన్​ నెటిజన్​కు ఫోన్​ చేయడానికి కారణమేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : May 16, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details