- అమూల్‌పై సోమవారం విచారణకు రానున్న రఘురామ పిల్
ఏపీ డెయిరీ అభివృద్ధి సంస్థ ఆస్తులను గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు కట్టపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఎంపీ రఘురామ హైకోర్డులో సవాల్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వేసిన ఈ పిల్‌పై.. సోమవారం విచారణ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు మరోసారి ఎంపీ రాఘురామను విచారించనున్న సీఐడీ
గుంటూరు సీఐడీ కార్యాలయంలో రాత్రి నుంచి రఘురామకృష్ణను సీఐడీ విచారించింది. అర్ధరాత్రి వరకు సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ నేతృత్వంలో ప్రశ్నల వర్షం కురిపించింది. నేడు మరోసారి విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి మధ్య తేడా ఏంటి?
భారత్‌లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలతో పాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా వచ్చే వారం అందుబాటులోకి వస్తోంది. ఈ మూడు టీకాల్లో ఏది ఎక్కు వ సమర్థవంతం? దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? డోసుల మధ్య వ్యవధి ఎంత ఉండాలనే విషయాలు తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్ పంజా: 'మహా'లో 2వేల కేసులు
మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కోరలుచాస్తోంది. ఇప్పటివరకు 2000 మందికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.1200కే ఇంజెక్షన్
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణకు వాడే యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ తయారీ నిమిత్తం జెనెటిక్ లైఫ్సైన్సెస్కు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. సంస్థ అత్యంత తక్కువ ధరకే ఈ ఇంజెక్షన్‌ను అందించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తగ్గుతున్న ఉద్ధృతి.. కొత్త కేసులు 3.26 లక్షలు