- ఆధునిక చిహ్నం రామాలయం
భవిష్యత్తు తరాలకు రామమందిరం స్ఫూర్తిదాయకమని ఉద్ఘాటించారు ప్రధాని మోదీ. హిందూ సంప్రదాయానికి అయోధ్యలోని రామమందిరం ఆధునిక చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రామమందిర శంకుస్థాపన మహోత్సవాన్ని తిలకించేందుకు యావత్ భారత్ దేశం ఏకమైందని వ్యాఖ్యానించారు మోదీ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 30 ఏళ్ల కృషి
రామమందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, వారంతా భూమిపూజ కార్యక్రమానికి రాలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రథయాత్ర సారథి ఎల్కే అడ్వాణీ కరోనా సంక్షోభం కారణంగా హాజరుకాలేకపోయారని తెలిపారు. ఆర్ఎస్ఎస్, ఇతర సంస్థలు చేసిన 30 ఏళ్ల కృషితో రామమందిర సమస్య పరిష్కారమైందని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మంత్రి బాలినేనికి కరోనా
తనకు కరోనా సోకిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటించారు. త్వరలోనే ఇంటికి చేరుకుంటానని అన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తన అభిమానులకు సందేశం పంపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎలక్ట్రానిక్ విధానంలో పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్డుకోవాలని కోరింది. టెండర్ ప్రక్రియ చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కలగజేసుకోవాలని చెప్పటానికి మీరెవరు?
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధాని విషయంలో కలగజేసుకోవాలని చెప్పటానికి మీరెవరంటూ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'కమలా'నందం
భాజపా హామీల్లో ఒకటైన అయోధ్య రామ మందిరం నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో కమలనాథుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమ పార్టీ సాధించిన సైద్ధాంతిక విజయానికి ప్రతీకగా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- జైడస్ వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్
దేశీయంగా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్న జైడస్ క్యాడిలా మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది. ఆగస్టు 6 నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 100కు చేరిన మృతులు
లెబనాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 100కు చేరిందని రెడ్ క్రాస్ సంస్థ వెల్లడించింది. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. నౌకాశ్రయం కేంద్రంగా జరిగిన ఈ పేలుడు కారణంగా చాలా భవనాలు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్రపంచకప్ ఆడటమే నా లక్ష్యం
ప్రపంచకప్ కంటే ముందు వన్డే జట్టులో మళ్లీ స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ. జట్టులో ఆడుతున్నప్పుడు ధోనీ.. తనకు చాలా మద్దతుగా నిలిచాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మహేశ్ సరసన అనన్యా పాండే!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయగా.. మరో పాత్ర కోసం బాలీవుడ్ నటి అనన్యా పాండేను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి