ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3Pm

.

By

Published : Jun 18, 2020, 3:03 PM IST

ప్రధాన వార్తలు @ 3Pm
ప్రధాన వార్తలు @ 3Pm

  • 24 గంటల్లో 425 కేసులు నమోదు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 425 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 299 మందికి పాజిటివ్​గా తేలగా... విదేశాల నుంచి వచ్చిన 26 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 100 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • సెలవిక: ఓ వీర సైనికా!

దేశ రక్షణ కోసం శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు యావత్‌ భారతావని అశ్రునయనాల నడుమ అంతిమ వీడ్కోలు పలికింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో... అమరజవాను అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • రేపే రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 స్థానాలకూ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • ఇటువంటి మంత్రులు ఉండటం దురదృష్టకరం

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంక్షోభం కోసమేనా ప్రజల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది అని నిలదీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • 'గాల్వన్​ ఘటనతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి'

తూర్పు లద్ధాక్​​ గాల్వన్​ లోయలో సరిహద్దు ఘటన దేశ ప్రజల మనోభావాలను గాయపరిచిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ అన్నారు. జాతీయ ప్రయోజనాల కంటే మరేదీ ముఖ్యం కాదన్న హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారాలను అన్వేషించాలన్నారు ప్రణబ్​​. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • వలస కార్మికుల కోసం 'ప్రధాని' నూతన పథకం

కరోనాతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులే లక్ష్యంగా ఓ నూతన పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకాన్ని జూన్​ 20న 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ అభియాన్​' పేరిట బిహార్​లో ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • వివాదాస్పద 'మ్యాప్'కు నేపాల్​ పార్లమెంటు ఆమోదం​

వివాదాస్పద కాలాపానీతో పాటు మరో 2 భారత ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్​ను ఆ దేశ పార్లమెంటు ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 57 మంది ఎంపీల ఓట్లతో నేపాల్ సరికొత్త​ పటానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • అందుకే హిందీ సినిమాలు చేయలేదు: రమ్యకృష్ణ

దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు పొందిన నటి రమ్యకృష్ణ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. అయితే హిందీ చిత్రాల్లో నటించడంపై రమ్యకృష్ణను ఓ మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆ 35 వేల మంది ఉద్యోగులపై వేటు తప్పదా!

కరోనా వైరస్​ ప్రభావంతో నష్టాలు ఎదుర్కొన్న సంస్థలు వాటి నుంచి బయటపడేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ ఏడాది సంస్థ ఖర్చులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది హెచ్​ఎస్​బీసీ. ఇందులో భాగంగా దాదాపు 35 వేల మందికి ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • కరోనా నుంచి కోలుకుంటున్నా: అఫ్రిదీ

కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు పాకిస్థాన్​ క్రికెటర్​ షాహిద్​ అఫ్రిదీ తెలిపాడు. ఇటీవలే వైరస్​ నిర్ధారణ అయిన ఈ ఆల్​రౌండర్​.. తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న అనేక వార్తలపై స్పందించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • భద్రతా మండలిలో భారత్​కు​ శాశ్వత హోదా ఎలా?

ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించింది.193 సభ్యదేశాలు కలిగిన యూఎన్‌ఎస్​సీ.. 2021-2022 కాలానికిగానూ భద్రతా మండలిలో ఓ తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ను ఎన్నుకున్నాయి. మొత్తం 192 ఓట్లు పోలవ్వగా 184 దేశాల మద్దతు లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details